
IPL 2021: కమాన్ హర్షల్.. ఐపీఎల్‌లో నువ్వు కొత్త చరిత్ర సృష్టిస్తావు!
(Photo: Harshal Patel Instagram)
ఇంటర్నెట్‌డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్ ఐపీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సీజన్‌లో 30 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో దూసుకెళ్తున్న అతడు ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో మరో మూడు వికెట్లు పడగొడితే.. ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పుతాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేయిన్ బ్రావో 2013లో 32 వికెట్లు తీసి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే హర్షల్ మరో మూడు వికెట్లు సాధిస్తే ఆ రికార్డునూ బద్దలుకొడతాడు.
మరోవైపు ఈ బెంగళూరు పేసర్ ఇప్పటికే ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్‌గానూ కొనసాగుతున్నాడు. 2020లో ముంబయి ఇండియన్స్ ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రా 27 వికెట్లతో చెలరేగి ఇదివరకు ఆ రికార్డు నెలకొల్పగా.. ఇప్పుడు బెంగళూరు పేసర్ దాన్ని తిరగరాశడు. లీగ్ దశలో కోహ్లీసేన తమ చివరి మ్యాచ్‌లో దిల్లీపై గెలవకముందు సన్‌రైజర్స్‌తో ఓ మ్యాచ్ ఆడి ఓటమిపాలైంది. అందులో హర్షల్ మూడు వికెట్లు తీసి బుమ్రా రికార్డును అధిగమించాడు. అలాగే జాతీయ జట్టుకు ఆడకుండా ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ ఈ బెంగళూరు పేసర్ మరో రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో బెంగళూరు.. ఈరోజు కోల్‌కతాతో తలపడే మ్యాచ్‌లో విజయం సాధించి.. ఆపై క్వాలిఫయర్-2లోనూ దిల్లీపై గెలుపొంది ఆ జట్టు ఫైనల్ చేరితే హర్షల్ మరిన్ని ఎక్కువ వికెట్లు తీసే అవకాశం ఉంది. ఇక దిల్లీ బౌలర్ అవేశ్ ఖాన్ ఈ సీజన్‌లో 23 వికెట్లతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
ఇవీ చదవండి
Advertisement