
IPL 2021: చెన్నైకి ‘కింగ్’ అయినా.. తల్లికి కొడుకే!
పుణెలో రుతురాజ్‌కు తల్లి ఆత్మీయ స్వాగతం
ఇంటర్నెట్‌డెస్క్: ఏ తల్లి అయినా తన కొడుకు గొప్ప ప్రయోజకుడు కావాలని కోరుకుంటుంది. అందుకోసం అహర్నిశలు కష్టపడుతుంది. ఆ కొడుకు ఏదైనా గొప్పపని చేసి ప్రజల మన్ననలు పొందితే ఆమెకు దక్కే ఆనందం అంతా ఇంతా కాదు. అచ్చం ఇలాంటి అనుభూతినే పొందుతున్నారు చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తల్లి సరితా గైక్వాడ్. యూఏఈలో జరిగిన ఐపీఎల్ 14వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అందులో రుతురాజ్ టాప్ స్కోరర్ (635)గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఆదివారం అతడు పుణెలోని ఇంటికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా చెన్నై ఓపెనర్‌కు ఘన స్వాగతం లభించింది.
ఈ సీజన్‌లో టాప్ స్కోరర్‌గా ఆరెంజ్ క్యాప్ అందుకున్న రుతురాజ్ దాదాపు రెండు నెలల తర్వాత ఇంటికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతడి తల్లి ఎంతో ప్రేమతో స్వాగతం పలికింది. ఇల్లంతా పూలతో అలంకరించి.. దిష్టితీసి మరీ ఇంట్లోకి ఆహ్వానించింది. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్‌లో అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేసింది. 24 ఏళ్ల రుతురాజ్ ఈ సీజన్‌లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడి 45.35 సగటుతో 7 అర్ధశతకాలు, ఒక శతకం బాదాడు. దీంతో 635 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ అందుకున్న పిన్న వయస్కుడిగా నిలిచాడు. మరోవైపు ఫైనల్లో కోల్‌కతాపై చెలరేగిన డుప్లెసిస్ (86) 633 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరూ చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.