IPL 2021: కృనాల్‌ పాండ్య దీర్ఘ కాలం ఆడాలంటే ఇలా చేయాలి: మంజ్రేకర్

ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు కృనాల్‌ పాండ్య టీ20 క్రికెట్‌లో దీర్ఘకాలం కొనసాగాలంటే బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా కాకుండా బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌గా ఉండాలని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు...

Updated : 24 Sep 2021 06:36 IST

(Photo: Krunal Pandya Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు కృనాల్‌ పాండ్య టీ20 క్రికెట్‌లో దీర్ఘకాలం కొనసాగాలంటే బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా కాకుండా బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌గా ఉండాలని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కృనాల్‌(4) విఫలమైన నేపథ్యంలో మంజ్రేకర్‌ ఈ విషయాన్ని ప్రస్తావించాడు.

అతడు జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడుతున్నాడా లేదా అనే విషయం ముంబయి ఇండియన్స్‌ పరిశీలించాలి. చెన్నైతో ఆడిన గత మ్యాచ్‌లో ఆ జట్టు పలు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడినప్పుడు కృనాల్‌ బాధ్యతగా ఆడాల్సింది. చెన్నై జట్టులో రుతురాజ్‌(88) ఆడినట్లు ఆదుకోవాల్సింది. అతడి మీద నాకు అలాంటి అంచనాలున్నాయి. అలాగే అతడు దీర్ఘకాలం పొట్టి ఫార్మాట్‌లో కొనసాగాలంటే బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా కాకుండా బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా కొనసాగాలి. అలా చేస్తే జట్టు యాజమాన్యం దృష్టిలో ఉండే అవకాశం ఉంది’ అని మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని