IPL 2021: అన్నీ మనం అనుకున్నట్లు జరగవు.. సచిన్, బ్రాడ్‌మన్‌కు ఏమైందో చూడలేదా: గావస్కర్
అన్నీ మనం అనుకున్నట్లు జరగవని, ఆటలో ప్రతి ఒక్కరూ ఘన ముగింపు ఇవ్వాలని అనుకుంటారని టీమ్ఇండియా దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ అన్నాడు...
ఇంటర్నెట్‌డెస్క్: ఆటలో ప్రతి ఒక్కరూ ఘనమైన ముగింపు ఇవ్వాలని అనుకుంటారని.. అయితే అన్నీ మనం అనుకున్నట్లు జరగవని టీమ్ఇండియా దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ అన్నాడు. సోమవారం రాత్రి కోల్‌కతాతో తలపడిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆర్సీబీ కెప్టెన్‌గా చివరిసారైనా కప్పు సాధించాలని ఆశించిన విరాట్ కోహ్లీకి నిరాశే ఎదురైంది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్లో అతడు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటున్న నేపథ్యంలో గావస్కర్ స్పందించాడు. ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ తాను కూడా నిరాశకు గురైనట్లు చెప్పాడు.
‘ఇది కచ్చితంగా నిరాశ కలిగించేదే. ప్రతి ఒక్కరూ చాలా గొప్పగా ముగింపు ఇవ్వాలని అనుకుంటారు. కోహ్లీ కూడా వ్యక్తిగతంగా అలాగే భావించి ఉంటాడు. కానీ, ఇలాంటి విషయాలు ఎప్పుడూ మనం అనుకున్నట్లు లేదా అభిమానులు ఆశిస్తున్నట్లు జరగవు. బ్రాడ్‌మన్‌లాంటి దిగ్గజాన్ని చూడండి ఏం జరిగిందో. అతడి కెరీర్లో 100 సగటు సాధించడానికి చివరి మ్యాచ్‌లో నాలుగు పరుగులే అవసరమయ్యాయి. కానీ, అందులోనే డకౌటయ్యాడు. అలాగే సచిన్‌ను చూడండి. తన 200వ టెస్టులో శతకంతో ముగించాలని అనుకొని ఉంటాడు. కానీ 79 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఎప్పుడూ మనం ఊహించినట్లు రాసిపెట్టి ఉండదు. అందరూ ఘనంగా ముగింపు ఇవ్వాలంటే కుదరదు’ అని గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
అలాగే కోహ్లీ ఆర్సీబీకి ఆయువుపట్టులా మారాడని, ఆ జట్టుకు ఒక ప్రత్యేకత తీసుకొచ్చాడని గావస్కర్ ప్రశంసించాడు. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరని.. శక్తివంచన లేకుండా జట్టు కోసం పాటుపడ్డాడని మెచ్చుకున్నాడు. 2016 సీజన్లో 973 పరుగులు సాధించాడని, ఇది చాలా అరుదైన విషయమని తెలిపాడు. బెంగళూరుకు ఒక బ్రాండ్ తీసుకొచ్చాడని తెలిపాడు. ఇలాంటి గొప్ప ఆటగాడు ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోవడం బాధాకరమన్నాడు. ఇకపై కెప్టెన్‌గా తప్పుకొన్నా ఆటగాడిగా అదే జట్టు తరఫున కొనసాగడం కోహ్లీ అంకితభావానికి నిదర్శనమని మాజీ క్రికెటర్ ప్రశంసించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 138/7 స్వల్ప స్కోర్ చేసింది. అనంతరం కోల్‌కతా 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మోర్గాన్ టీమ్ తర్వాతి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్‌గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్‌కతా మాజీ ఆటగాడు
కోల్‌కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్‌గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్‌లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్‌రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్‌కు మారు పేరు! సన్‌రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్‌రేట్‌లో ఎప్పుడూ వెనుకంజే! సన్‌రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్‌లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్‌కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్‌కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్‌తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్‌తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్‌కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్‌కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్‌గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్‌ను తప్పించాల్సిందే
ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్‌ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి