
IPL 2021: సురేశ్ రైనా మ్యాచ్ విన్నర్.. అతడుంటే చెన్నై ఫైనల్స్ చేరగలదు: గావస్కర్
ఇంటర్నెట్‌డెస్క్: దిల్లీ క్యాపిటల్స్‌తో ఈరోజు సాయంత్రం జరగనున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కీలక బ్యాట్స్‌మన్ సురేశ్ రైనాను ఆడించాలని టీమ్‌ఇండియా దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ఓ జాతీయ పత్రికకు రాసిన వ్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. రైనా ఈ సీజన్‌లో పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో చెన్నై గత రెండు మ్యాచ్‌ల్లో అతడిని పక్కనపెట్టి రాబిన్ ఉతప్పకు అవకాశం ఇచ్చింది. అతడు కూడా విఫలమైన నేపథ్యంలో చెన్నై ప్లేఆఫ్స్‌లో రైనాను తీసుకోవాలని సూచించాడు.
‘రైనా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నా చెన్నై కచ్చితంగా తిరిగి ప్లేఆఫ్స్‌లో ఆడించాలనుకుంటుంది. అతడు మ్యాచ్ విన్నర్. గతకొన్నేళ్లుగా ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కోడానికి అతడు ఇబ్బందులు పడుతున్నా మ్యాచ్ పరిస్థితులను తలకిందులు చేసే సామర్థ్యం కలవాడు. మరోవైపు దిల్లీ జట్టులో ఆన్‌రిచ్ నోర్జే, కగిసో రబాడ, అవేశ్ ఖాన్ లాంటి పేసర్లు రైనాను ఇబ్బంది పెట్టడానికి చూస్తారు. అయినా, ధోనీసేన అతడిని తుది జట్టులోకి తీసుకోవాలి. ఎందుకంటే రైనాను తీసుకోవడం వల్ల ఆ జట్టు ఫైనల్స్ చేరే అవకాశం ఉంటుంది’ అని గావస్కర్ పేర్కొన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.