
India vs England: ఇదీ మన బౌలర్ల విజృంభణ
ఇంటర్నెట్ డెస్క్: ఆంగ్లేయుల గడ్డపై టీమ్ఇండియా దుమ్మురేపుతోంది. నాలుగో టెస్టులో అద్వితీయ విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీసులో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. దాదాపుగా 50 ఏళ్ల తర్వాత ఓవల్ మైదానంలో గెలుపు బావుటా ఎగరేసింది. ఆశల్లేని స్థితిలోంచి పుంజుకొని అద్భుతంగా మ్యాచును ముగించింది.
ఈ మ్యాచులో టీమ్ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 191 పరుగులే చేసింది. ఇంగ్లాండ్ 290తో బదులివ్వడంతో రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన భారీ స్కోరు చేయాల్సి వచ్చింది. అందుకు తగ్గట్టే ఆటగాళ్లంతా సమష్టిగా ఆడి 466 పరుగులు చేశారు. రోహిత్ (127) శతకంతో అదరగొట్టగా.. పుజారా (61), రిషభ్ పంత్ (50), శార్దూల్ ఠాకూర్ (60) అర్ధశతకాలు బాదేశారు. ఇక కేఎల్ రాహుల్ (46), విరాట్ కోహ్లీ (44), ఉమేశ్ యాదవ్ (25), జస్ప్రీత్ బుమ్రా (24) సమయోచితంగా ఆడారు.
ఆఖరి రోజు లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌కు గెలిచేందుకు లేదా డ్రా చేసుకొనేందుకు అవకాశాలు కనిపించాయి. ఓపెనర్లు రోరీ బర్న్స్ (50), హసీబ్ హమీద్ (63) తొలి వికెట్‌కు వంద పరుగుల భాగస్వామ్యం అందించడమే కారణం. ఈ దశలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. బుమ్రా (2/27) రివర్స్‌స్వింగ్‌తో దాడి చేయగా మరో ఎండ్‌లో గరుకు బంతులేస్తూ జడ్డూ (2/50) ఉక్కిరిబిక్కిరి చేశాడు. శార్దూల్ (2/22), ఉమేశ్ (3/60) తమ వంతు బాధ్యతగా వికెట్లు తీశారు.
ఈ క్రమంలో టెస్టుల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన పేసర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు. భారత బౌలర్లు వేసిన ఒక్కో బంతి.. ఆంగ్లేయులకు గండంగా తోచింది. మనోళ్లు వికెట్లు తీసిన విధానం మీరూ చూసేయండి!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Road Accident: ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సు-లారీ ఢీ: ఒకరు మృతి, 20 మందికి గాయాలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
-
World News
Senegal: సమద్రంలో బోటు బోల్తా.. 13 మంది మృతి, 40మంది గల్లంతు!
-
India News
Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
-
India News
Jammu: జమ్మూలో మరో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Sports News
Hanuma vihari : మన దగ్గర పోటీ ఎక్కువ.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు సిద్ధమే: హనుమ విహారి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం
- Maharashtra Crisis: సీఎం పదవికి రాజీనామా
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- కథ మారింది..!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి
- Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!