Published : 13/08/2021 10:13 IST

KL Rahul - Rohit Sharma: రాహుల్‌, రోహిత్‌.. దంచుడే దంచుడు! వీడియో చూస్తారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో టీమ్‌ఇండియా అదరగొడుతోంది. వర్షం కురిసి, మబ్బులు పట్టిన వాతావరణంలోనూ జిమ్మీ అండర్సన్‌, మార్క్‌వుడ్‌, ఒలీ రాబిన్సన్‌ బౌలింగ్‌ను ఉతికారేసింది. తొలిరోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ముఖ్యంగా ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (127*; 248 బంతుల్లో 12×4, 1×6), రోహిత్‌ శర్మ (83; 145 బంతుల్లో 11×4, 1×6) తొలి వికెట్‌కు 126 పరుగులు జోడించారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న వాతావరణంలో 44 ఓవర్ల వరకు తొలి వికెట్‌ ఇవ్వకపోవడం గమనార్హం.

మొదట రోహిత్‌ శర్మ తనదైన రీతిలో ఆడాడు. సొగసైన షాట్లతో అలరించాడు. థర్డ్‌మ్యాన్‌ దిశగా అతడు బాదిన బౌండరీలు అద్భుతమనే చెప్పాలి. అతడు ఔటయ్యాక ఇంగ్లాండ్‌కు రాహుల్ చుక్కలు చూపించాడు. తనదైన స్ట్రోక్‌ప్లేతో మురిపించాడు. చూడచక్కని కట్‌షాట్లు, బ్యాక్‌ఫుట్‌ పంచ్‌లతో బౌండరీలు బాదేశాడు. నిలదొక్కుకొనేంత వరకు నెమ్మదిగా ఆడాడు. తొలి 100 బంతుల్లో 18 పరుగులు చేసిన అతడు అర్ధశతకానికి మరో 37 బంతులే తీసుకున్నాడు. ఆపై మరో 75 బంతుల్లో సెంచరీ కొట్టేశాడు. విరాట్‌ కోహ్లీ (42; 103 బంతుల్లో 3×4) సైతం రాణించాడు.

తొలిరోజు ఆటకు సంబంధించిన వీడియో మీకోసం..


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని