T20 World Cup: ధోని డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉంటే..

ధోని ఉంటే డ్రెస్సింగ్‌రూమ్‌ ఎంతో ప్రశాంతంగా ఉంటుందని కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో కఠిన పోరాటాలకు సిద్ధమవుతున్న టీమ్‌ఇండియాకు ధోనీకి మించిన మెంటార్‌ ఉండడని వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచకప్‌లో రాహుల్‌.. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌

Updated : 20 Oct 2021 08:13 IST

దుబాయ్‌: ధోని ఉంటే డ్రెస్సింగ్‌రూమ్‌ ఎంతో ప్రశాంతంగా ఉంటుందని కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో కఠిన పోరాటాలకు సిద్ధమవుతున్న టీమ్‌ఇండియాకు ధోనీకి మించిన మెంటార్‌ ఉండడని వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచకప్‌లో రాహుల్‌.. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించనున్న సంగతి తెలిసిందే. భారత్‌ తన తొలి మ్యాచ్‌లో ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొంటుంది. ‘‘ధోని తిరిగి జట్టుతో కలిసినందుకు సంతోషంగా ఉంది. మేం అతడి నాయకత్వంలో ఆడాం. కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా మేం అతణ్ని మెంటార్‌గానే చూశాం’’ అని రాహుల్‌ చెప్పాడు. ‘‘కెప్టెన్‌గా ఉన్నప్పుడు డ్రెస్సింగ్‌రూమ్‌లో ధోని ప్రశాంత స్వభావం మాకు ఎంతో నచ్చేది. అతణ్ని ఎంతో గౌరవించేవాళ్లం. ఇప్పుడు అతడు మళ్లీ మాతో కలిసినందుకు గొప్పగా అనిపిస్తోంది. అతడు ఉండడం వల్ల ఒకరకమైన ప్రశాంతత వస్తుంది. గత కొన్ని రోజులుగా అతడి సమయాన్ని వెచ్చించడాన్ని ఆస్వాదిస్తున్నా. చాలా సరదాగా గడిచిపోతోంది. రానున్న రోజుల్లో ధోని బుర్రను పూర్తిగా ఉపయోగించుకుంటా’’ అని అన్నాడు. ఐపీఎల్‌ 2021 ఫైనల్‌.. ధోని చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌ అని తామెవరమూ అనుకోవట్లేదని రాహుల్‌ తెలిపాడు. 40 ఏళ్లు దాటినా.. బలంగా ఉన్న కుర్రాళ్ల కంటే కూడా ఎక్కువ దూరం అతడు సిక్స్‌ కొట్టగలడని చెప్పాడు. ధోని చాలా బలంగా, ఫిట్‌గా ఉన్నాడని రాహుల్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని