Paralympics: స్వర్ణంతో అదరగొట్టిన కృష్ణ నాగర్‌

పారాలింపిక్స్‌లో భారత్‌ జోరు కొనసాగుతోంది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌-6లో

Updated : 05 Sep 2021 11:47 IST

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్‌ జోరు కొనసాగుతోంది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌-6లో కృష్ణ నాగర్‌ స్వర్ణంతో అదరగొట్టాడు. ఫైనల్లో హాంకాంగ్‌ ఆటగాడు కైమన్‌ చూపై కృష్ణ విజయం సాధించి పసిడిని ముద్దాడాడు. ఈరోజు ఇప్పటికే భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. ఈ ఉదయం బ్యాడ్మింటన్‌ ఎస్‌ఎల్‌-4 విభాగంలో సుహాస్‌ యతిరాజ్‌ రజతం సాధించగా తాజాగా కృష్ణ స్వర్ణం తీసుకొచ్చాడు. దీంతో పారాలింపిక్స్‌లో ఇప్పటి వరకు భారత్‌ సాధించిన పతకాల సంఖ్య 19కి చేరింది. వీటిలో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి.

రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు..

పారాలింపిక్స్‌లో స్వర్ణాన్ని ముద్దాడిన కృష్ణ నాగర్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా అభినందించారు. ‘కృష్ణ నాగర్‌ చరిత్రాత్మక ప్రదర్శన చేశారు. పారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో పతకం సాధించడం ద్వారా మువ్వన్నెల జెండా మరింత ఎత్తున రెపరెపలాడింది. మీ నుంచి ఎంతో మంది భారతీయులు ప్రేరణ పొందుతారు. అభినందనలు’ అని రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు.

‘పారాలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు రాణించడం ఎంతో సంతోషంగా ఉంది. కృష్ణ నాగర్‌ సాధించిన ఈ విజయం ప్రతి భారతీయుడి ముఖంలో చిరునవ్వులను పూయించింది. బంగారు పతకం సాధించినందుకు కృష్ణ నాగర్‌కు అభినందనలు’ అని ప్రధాని ట్వీట్ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని