Mirabai Chanu: మీరాబాయి చాను.. ఇన్‌స్టాలో టాప్‌10 పోస్టులివే..

వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత సుదీర్ఘ ఎదురుచూపులకు తెరదించుతూ టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించింది మీరాబాయి చాను. యావత్ భారతావనిని గర్వపడేలా చేసిన ఈ

Updated : 23 Feb 2024 18:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత సుదీర్ఘ ఎదురుచూపులకు తెరదించుతూ టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించింది మీరాబాయి చాను. యావత్ భారతావనిని గర్వపడేలా చేసిన ఈ మణిపుర్‌ మణిపూస.. బరువులు ఎత్తడంతో పాటు సోషల్‌మీడియాలోనూ యాక్టివ్‌గానే ఉంటుంది. ముఖ్యంగా సందర్భానికి అనుగుణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ తన అభిప్రాయాలను పంచుకుంటుంది. చానుకు బాక్సర్‌ మేరీకోమ్‌ అంటే చాలా ఇష్టం. ఆమెతో దిగిన ఫొటోలను కూడా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఖాళీ దొరికితే చాలు.. కుటుంబసభ్యులు, స్నేహితులతోనే చాను ఎక్కువగా గడుపుతుంటుంది. ఆ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూనే ఉంటుంది. అమ్మ అంటే చానుకు అమితమైన ప్రేమ. అంతేనా.. ఎక్కువగా క్రీడా దుస్తుల్లో మాత్రమే కన్పించే ఈమె.. అప్పుడప్పుడు సంప్రదాయ చీరకట్టు, ఫ్యాషన్‌ దుస్తుల్లోనూ కన్పించడం విశేషం. మరి చాను ఇన్‌స్టాలో టాప్‌ 10 పోస్టులేంటో ఓసారి చూద్దాం..!








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని