
Ashes Series: పింక్ బాల్ టెస్టుల్లో మిచెల్ స్టార్క్ కొత్త రికార్డు
అడిలైడ్: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ పింక్ బాల్ టెస్టుల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శనివారం రెండు వికెట్లు తీసి పింక్‌బాల్ (డే/నైట్) టెస్టుల్లో మొత్తం 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇంగ్లాండ్ శనివారం 17/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడోరోజు ఆటను ప్రారంభించగా చివరికి 236 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ మలన్ (80), కెప్టెన్ జోరూట్ (62) అర్ధశతకాలతో రాణించారు. అంతకుముందు శుక్రవారం స్టార్క్.. ఇంగ్లాండ్ ఓపెనర్లు రోరీ బర్న్స్ (4), హసీబ్ హమీద్ (6)లను ఔట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట నిలిచిపోయేసరికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 45 పరుగులకు ఒక వికెట్ నష్టపోయింది. నాలుగో రోజు ఆదివారం ఆసీస్ మరిన్ని ఎక్కువ పరుగులు సాధించి ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని చూస్తోంది. ఇప్పటికైతే మ్యాచ్ ఆస్ట్రేలియాకే అనుకూలంగా ఉంది. ఇంగ్లాండ్ ఏదైనా గొప్ప ప్రదర్శన చేస్తే తప్ప రెండో టెస్టులోనూ ఓటమి తప్పించుకోలేదు.