Kohli - Rohit: కోహ్లీ - రోహిత్‌ ఇలా చేస్తే.. లేనిపోని చర్చ జరుగుతుంది : అజహర్‌

దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్‌ కోహ్లీ వన్డే సిరీస్‌ ఆడకపోవడం, మరోవైపు రోహిత్‌ శర్మ టెస్టు సిరీస్‌కు దూరంగా ఉండటం లాంటివి.. జట్టులో విభేదాలు ఉన్నాయనే విషయాన్ని రుజువు చేస్తాయని టీమ్‌ఇండియా...

Published : 15 Dec 2021 01:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్‌ కోహ్లీ వన్డే సిరీస్‌ ఆడకపోవడం, మరోవైపు రోహిత్‌ శర్మ టెస్టు సిరీస్‌కు దూరంగా ఉండటం లాంటివి.. జట్టులో విభేదాలు ఉన్నాయనే విషయాన్ని బహిర్గతం చేస్తాయని టీమ్‌ఇండియా మాజీ సారథి మహ్మద్‌ అజాహరుద్దీన్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. ఎవరైనా విశ్రాంతి తీసుకోవడంలో తప్పులేదని, కానీ.. తీసుకునే సందర్భం సరైనదిగా ఉండాలని మాజీ క్రికెటర్‌ పేర్కొన్నాడు. మరికొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనలో రోహిత్‌ శర్మ ఇప్పటికే గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా కోహ్లీ వ్యక్తిగత కారణాల రీత్యా వన్డే సిరీస్‌కు దూరంగా ఉంటానని యాజమాన్యానికి తెలియజేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అజహరుద్దీన్‌ స్పందిస్తూ ఈ విధంగా ట్వీట్‌ చేశాడు. 

ఇటీవల టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీ20 సారథ్య బాధ్యతలు వదులుకున్న విరాట్‌ కోహ్లీకి సెలక్షన్‌ కమిటీ షాకిచ్చింది. దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి ఇటీవల జట్టును ఎంపిక చేసినప్పుడు రోహిత్‌ను వన్డేగా నియమించింది. అలాగే టెస్టుల్లో అజింక్య రహానెను వైస్‌కెప్టెన్‌గా తొలగించి హిట్‌మ్యాన్‌కే ఆ బాధ్యతలు కూడా అప్పజెప్పింది. ఈ క్రమంలోనే ఆదివారం ప్రాక్టీస్‌ చేస్తుండగా రోహిత్‌ గాయపడ్డాడు. దీంతో అతడిని టెస్టు సిరీస్‌ నుంచి తప్పిస్తూ.. ప్రియాంక్‌ పాంచాల్‌కు అవకాశమిచ్చింది. అనంతరం కోహ్లీ వన్డే సిరీస్‌ ఆడబోనని జట్టు యాజమాన్యానికి తెలియజేసినట్లు సమాచారం అందుతోంది. అయితే, కోహ్లీ నుంచి అలాంటి సమాచారం ఏమీ అందలేదని బీసీసీఐ తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు