Joe Root: రూట్‌ను ఎలా ఔట్‌ చేయాలో టీమ్‌ఇండియాకు చెబుతున్న ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు

ఇంగ్లాండ్‌ సారథి జోరూట్‌ను ఎలా ఔట్‌ చేయాలో ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మాంటీ పనేసర్‌ వివరిస్తున్నాడు. అతడు క్రీజులోకి రాగానే జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌తో బౌలింగ్‌ చేయాలని సూచిస్తున్నాడు...

Published : 19 Aug 2021 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌ సారథి జోరూట్‌ను ఎలా ఔట్‌ చేయాలో ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మాంటీ పనేసర్‌ వెల్లడించాడు. అతడు క్రీజులోకి రాగానే జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌తో బౌలింగ్‌ చేయించాలని సూచించాడు. ఆఫ్‌స్టంప్‌కు ఆవల, నాలుగు లేదా ఐదో స్టంప్‌ లైన్‌లో బంతులు వేయాలని అంటున్నాడు.

ఆతిథ్య జట్టులో టీమ్‌ఇండియాకు అడ్డొస్తున్నది రూట్‌ ఒక్కడే. ఈ సిరీసులో జరిగిన రెండు మ్యాచుల్లో అతడు ఏకంగా రెండు శతకాలు, ఒక అర్ధశతకం చేశాడు. 128.66 సగటుతో 386 పరుగులు సాధించాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో అతడు అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే.

‘జో రూట్‌ను ఔట్‌ చేయాలంటే ఆఫ్‌స్టంప్‌ ఆవల, ఐదో స్టంప్‌ లైన్‌లో బంతులు వేయాలి. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ ఇదే ప్రణాళిక వేశాడు. జస్ప్రీత్‌ బుమ్రా దానిని చక్కగా అమలు చేశాడు. తర్వాత మ్యాచుల్లోనూ విరాట్‌ ఇదే ప్రణాళిక అమలు చేయాలి. ఎందుకంటే రూట్‌ పుల్‌ షాట్‌ అద్భుతంగా ఆడగలడు. అందుకే షార్ట్‌ పిచ్‌ బంతులు వేయొద్దు’ అని పనేసర్‌ తెలిపాడు.

జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌కు బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడి చేయగల నైపుణ్యాలు ఉన్నాయని మాంటీ ప్రశంసించాడు. వీరిద్దరూ రూట్‌ను అడ్డుకోగలరని తెలిపాడు. ‘రూట్‌ క్రీజులోకి రాగానే విరాట్‌ మరో ఆలోచన లేకుండా బుమ్రాను ప్రయోగించాలి. సిరాజ్‌ సైతం అతడిపై ఒత్తిడి తేగలడు. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఇలాగే చేశాడు. దాంతో రూట్‌ వికెట్ ఇచ్చేశాడు. రూట్‌ తన పొజిషన్‌ మార్చుకొనేలా చికాకు పెట్టాలి. అతడి జోరును అడ్డుకోవాలి. అలా చేస్తే అతడు పొజిషన్‌ మార్చుకొంటాడు. త్వరగా వికెట్‌ ఇచ్చేస్తాడు’ అని పనేసర్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని