Cricket News: గబ్బర్‌సేన లోపం అదొక్కటే: ముత్తయ్య

శ్రీలంక పర్యటనలో టీమ్‌ఇండియానే ఫేవరెట్‌గా కనిపిస్తోందని దిగ్గజ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ అన్నాడు. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకపోవడమే ఆ జట్టు లోపమని పేర్కొన్నాడు. ....

Published : 18 Jul 2021 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీలంక పర్యటనలో టీమ్‌ఇండియానే ఫేవరెట్‌గా కనిపిస్తోందని దిగ్గజ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ అన్నాడు. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకపోవడమే ఆ జట్టు లోపమని పేర్కొన్నాడు. భారత రిజర్వు బెంచ్‌ బలాన్ని చూస్తే రెండో శ్రేణి జట్టుగా అనిపించడం లేదని స్పష్టం చేశాడు. తొలి వన్డేకు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.

‘ఈ టీమ్‌ఇండియాకు ప్రతికూల అంశం ఒక్కటే. చాలాకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడలేదు. శ్రీలంక ఎలాగోలా కొన్ని మ్యాచులైతే ఆడింది. నిజమే.. బాగా ఆడకపోయినా అనుభవమైతే ఉంది కదా! మ్యాచ్‌ మొదలైతే ఉత్కంఠ, ఆందోళన కలుగుతాయి’ అని ముత్తయ్య అన్నాడు.

‘తొలి మ్యాచ్‌ భారత్‌కు కీలకం. ఎందుకంటే వారు అత్యుత్తమంగా ఆడాలి. లేదంటే వారిపై వారికే అనుమానాలు కలుగుతాయి. పర్యటనలో గబ్బర్‌ సేనే ఫేవరెట్‌. కానీ శ్రీలంకకు అవకాశం ఉంది. ఎందుకంటే వారు ఈమధ్యే క్రికెట్‌ ఆడొచ్చారు’ అని ముత్తయ్య తెలిపాడు.

భారత క్రికెట్‌ జట్టు రిజర్వు బెంచ్‌ అద్భుతంగా ఉందని ముత్తయ్య ప్రశంసించాడు. ఈ టీమ్‌ఇండియాను ఎవరూ ద్వితీయ శ్రేణి జట్టుగా పరిగణించలేరని తెలిపాడు. ఎందుకంటే వారంతా ఆడగలిగే క్రికెటర్లని వెల్లడించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో అత్యంత పోటీని ఎదుర్కొని, రాటుదేలినవారేనని స్పష్టం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని