Virat Kohli: కోహ్లీసేన ఇక ‘స్వింగ్‌’ ఆడటం కష్టమేనన్న నాసర్‌ హుస్సేన్‌

టీమ్‌ఇండియా స్వింగ్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టమేనని ఇంగ్లాండ్‌ మాజీ సారథి నాసర్‌ హుస్సేన్‌ అంటున్నాడు...

Published : 31 Aug 2021 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా స్వింగ్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టమేనని ఇంగ్లాండ్‌ మాజీ సారథి నాసర్‌ హుస్సేన్‌ అంటున్నాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వదిలేయాల్సిన బంతులనూ ఆడేస్తున్నాడని తెలిపాడు. భారత్‌ ఒక్కోసారి స్వల్ప పరుగులకే ఆలౌటైనా వెంటనే పుంజుకోగలదని వెల్లడించాడు.

‘కోహ్లీ మూడో రోజు ఒక స్పెల్‌ ఆడాడు. ఐతే అతనాడింది పాత బంతితోనని గుర్తుంచుకోవాలి. కొత్త బంతితో ఆడటం అతడికి కష్టమవుతోంది. ఎందుకంటే కొత్త బంతి ఆలస్యంగా స్వింగ్‌ అవుతుంది. అందుకే శనివారం అతడు ఎప్పటి మాదిరిగానే ఔటయ్యాడు’ అని హుస్సేన్‌ తెలిపాడు.

‘నిజానికి వదిలేయాల్సిన బంతులను విరాట్‌ కోహ్లీ ఆడుతున్నాడు. అతడి బ్యాటింగ్‌ టెక్నిక్‌లో కొద్దిగా లోపం కనిపిస్తోంది. బ్యాక్‌ఫుట్‌ పొజిషనింగ్‌ ఇబ్బందులతో అండర్సన్‌, రాబిన్సన్‌ బంతులను ఆడలేకపోతున్నాడు. వేసేది ఇన్‌స్వింగరా లేదా ఔట్‌ స్వింగరా గుర్తించలేక బంతిని ఆడాలా వద్దా అని సందేహపడుతున్నాడు. ఏం చేయాలో అతడికి అర్థమవ్వడం లేదు. ఇంగ్లాండ్‌ తరహా అత్యుత్తమ బౌలింగ్‌ ఆడటం అతడికి ఏమంత సులువు కాదు’ అని హుస్సేన్‌ అంటున్నాడు.

మూడో టెస్టులో 78 పరుగులకే కుప్పకూలినంత మాత్రాన టీమ్‌ఇండియాను తక్కువ అంచనా వేయొద్దని నాసర్‌ హుస్సేన్‌ తెలిపాడు. అడిలైడ్‌లో 36కే ఆలౌటైనా ఏకంగా సిరీస్‌ గెలిచిన సంగతి గుర్తు చేస్తున్నాడు. టీమ్‌ఇండియాకు బలం, తెగువ, నైపుణ్యాలు ఉన్నాయని వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని