Tokyo olympics: షూటింగ్‌లో మరోసారి నిరాశ.. 200మీ. పరుగులో ద్యుతీ ఓటమి

షూటింగ్‌లో పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌ అర్హత పోటీల్లో భారత్‌కు నిరాశే ఎదురైంది. ఐశ్వరీ ప్రతాప్‌సింగ్‌, సంజీవ్‌ రాజ్‌పుత్‌ తుదిపోరుకు అర్హత సాధించలేదు...

Published : 02 Aug 2021 12:05 IST

టోక్యో: షూటింగ్‌లో పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌ అర్హత పోటీల్లో భారత్‌కు నిరాశే ఎదురైంది. ఐశ్వరీ ప్రతాప్‌సింగ్‌, సంజీవ్‌ రాజ్‌పుత్‌ తుదిపోరుకు అర్హత సాధించలేదు.

39 మంది తలపడ్డ ఈ అర్హత పోరులో ప్రతాప్‌సింగ్‌ 1167-63X పాయింట్లతో 21వ స్థానంలో నిలిచాడు. నీలింగ్‌లో (మోకాలిపై కూర్చొని) 388, ప్రోన్‌లో 391, స్టాండింగ్‌ (నిలబడి)లో 379 పాయింట్లు సాధించాడు. 9.725 సగటు నమోదు చేశాడు. మరో షూటర్‌ సంజీవ్‌ 32వ స్థానంలో నిలిచాడు. నీలింగ్‌లో 387, ప్రోన్‌లో 393, స్టాండింగ్‌లో 377తో మొత్తం 1157-55X పాయింట్లు సాధించాడు. అతడి సగటు 9.642గా నమోదైంది.

ఇక మహిళల 200మీటర్ల పరుగులో ద్యుతీచంద్‌ నిరాశపరిచింది. తొలిరౌండ్‌, హీట్‌-1లో ఏడో స్థానానికి పరిమితమైంది. 23.85 సెకన్లలో పరుగు పూర్తి చేసింది. ఈ సీజన్‌లో ఆమెకిదే అత్యుత్తమ టైమింగ్‌ అయినప్పటికీ తుది పోరుకు అర్హత సాధించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని