IND vs PAK : భారత్‌తో మ్యాచ్‌లోఅతి విశ్వాసం ప్రదర్శించలేదు: బాబర్

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పది వికెట్ల తేడాతో విజయం సాధించడం ఎప్పటికీ ...

Updated : 01 Jan 2022 15:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పది వికెట్ల తేడాతో విజయం సాధించడం ఎప్పటికీ మరువలేమని పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్‌ అజామ్‌ తెలిపాడు. పీసీబీ యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ.. గతేడాది తమ జట్టు సాధించిన అత్యుత్తమ విజయాల్లో ఇదొకటని గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా మరోసారి తన జట్టు సభ్యులను ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రపంచస్థాయి అత్యుత్తమ జట్లలో ఒకటైన భారత్‌ను ఎదుర్కోవడమంటే చాలా ఒత్తిడితో కూడుకున్నదని చెప్పాడు. ‘‘భారత్‌పై విజయం సాధించడం అంటే.. మాటల్లో చెప్పలేను. గత రికార్డుల గురించి అసలు ఆలోచించలేదు. అప్పుడు (అప్పటి మ్యాచ్) ఏం చేయాలనే దానిపైనే దృష్టిపెట్టాం. మ్యాచ్‌లో మా ప్రారంభం, ముగింపును తలచుకుంటే అద్భుతం. అంతేకాకుండా అభిమానుల నుంచి వచ్చిన స్పందన కూడా అపూర్వం. ఇదంతా జట్టు సభ్యుల సమష్టి కృషి. మ్యాచ్‌ను గెలవగలమని నమ్మామే కానీ.. మితిమీరిన ఆత్మవిశ్వాసానికి పోలేదు’’ అని వివరించాడు. 

టీ20 ప్రపంచకప్‌ మొదటి మ్యాచ్‌ నుంచే దూకుడుగా ఆడిన పాకిస్థాన్‌ గ్రూప్‌ స్టేజ్‌లో ఓటమి లేకుండా సెమీస్‌కు దూసుకెళ్లింది. అయితే అక్కడ ఆసీస్‌ చేతిలో భంగపాటు తప్పలేదు. దీనిపై బాబర్ స్పందిస్తూ ‘‘ప్రపంచకప్‌ గ్రూప్‌ పోటీల్లో ఆధిపత్యం చెలాయిస్తూ రాణించాం. అయితే దురదృష్టవశాత్తూ సెమీస్‌లో ఓడిపోయాం. చేసిన పొరపాట్లు ఒక్కోసారి ఫలితంపై ఎంత తీవ్ర ప్రభావం చూపుతాయనేదానికి సెమీస్‌ చక్కటి ఉదాహరణ. అయితే ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నాం. వచ్చేసారి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కష్టపడతాం’’ అని పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు