PM Modi with Paralympic contingent: ప్రధాని మోదీకి పారా అథ్లెట్ల బహుమతి

టోక్యో పారాలింపిక్స్‌లో అత్యధికంగా 19 పతకాలతో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత పారా అథ్లెట్ల బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గురువారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అల్పాహార విందు...

Published : 09 Sep 2021 19:14 IST

(Photo: Anurag Thakur Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టోక్యో పారాలింపిక్స్‌లో అత్యధికంగా 19 పతకాలతో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత పారా అథ్లెట్ల బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గురువారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అల్పాహారవిందులో అథ్లెట్లందరినీ తమ కోచ్‌లతో సహా కలిశారు. ఈ సందర్భంగా పతక విజేతలు ఓ తెల్లటి శాలువాపై సంతకాలు చేసి మోదీకి బహుమతిగా అందజేశారు. దాన్నీ ఆయన మెడలో వేసుకొని అథ్లెట్లతో సంతోషంగా గడిపారు. అథ్లెట్లు తమ జీవితాల్లో ఎదురైన ఎన్నో కష్టనష్టాలకోర్చి ఇలా పతకాలు సాధించడం గొప్ప విశేషమని కొనియాడారు.

ఈ పారా అథ్లెట్ల విజయాలు దేశంలోని క్రీడాకారులకు స్ఫూర్తి కలిగిస్తాయని, ఇప్పుడిప్పుడే క్రీడాకారులుగా ఎదగాలని చూస్తున్నవారికి ప్రేరణగా నిలుస్తాయని మోదీ అన్నారు. పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారి క్రీడా పరికరాలు, కిట్లను వేలం వేయనున్నట్లు తెలిపారు. ఈ క్రీడాకారుల శక్తి సామర్థ్యాలు మెచ్చుకోదగినవని పేర్కొన్నారు. అలాగే ఇందులో పతకాలు గెలవని వారిని ఉద్దేశిస్తూ.. నిజమైన క్రీడాకారులెవరూ ఓటములు, వైఫల్యాలు చూసి కుంగిపోరని.. ఎల్లప్పుడూ ముందుకు సాగుతారని మోదీ స్ఫూర్తి నింపారు. కాగా, ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని