Tokyo Paralympics: వావ్‌ హర్విందర్‌.. భారత్‌కు మరో కాంస్యం

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్‌ పోటీల్లో హర్విందర్‌ సింగ్‌ కాంస్య పతకం సాధించాడు. దాంతో పారాలింపిక్స్‌ ఆర్చరీ విభాగంలో భారత్‌కు తొలి పతకం అందించిన...

Updated : 03 Sep 2021 19:19 IST


(Photo: SAI Media Twitter)

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్‌ పోటీల్లో హర్విందర్‌ సింగ్‌ కాంస్య పతకం సాధించాడు. పారాలింపిక్స్‌ ఆర్చరీ విభాగంలో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. ఇది వరకు 2018 ఆసియా పారా క్రీడల్లో తొలిసారి స్వర్ణం సాధించిన హర్విందర్‌ ఇప్పుడు విశ్వ క్రీడల్లోనూ సత్తా చాటాడు. కొరియన్‌ అథ్లెట్‌ కిమ్‌తో కాంస్య పోరులో పోటీపడిన హర్విందర్‌ 6-5 (26-24, 27-29, 28-25, 25-25, 26-27) (10-8) తేడాతో గెలుపొందాడు. అంతకుముందు సెమీఫైనల్స్‌లో అమెరికా అథ్లెట్‌ కెవిన్‌ మాదర్‌ చేతిలో 6-4 (25-28, 24-24, 25-25, 25-24, 24-26) తేడాతో ఓటమిపాలయ్యాడు. మరోవైపు ఈ ఉదయం ప్రవీణ్‌ కుమార్‌ హైజంప్‌లో రజతం సాధించగా అవనీ లేఖరా 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ ఎస్‌హెచ్‌ 1 పోటీల్లో కాంస్య పతకం సాధించింది. దీంతో ఈ పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య 13కు చేరడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని