Ajinkya Rahane: నా గురించి మాట్లాడుకుంటున్నారంటే.. నేను ముఖ్యమైనవాడినే

లార్డ్స్‌ టెస్టులో మరీ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశారంటూ తనపై, పుజారాపై వస్తున్న విమర్శలను భారత బ్యాట్స్‌మన్‌ రహానె కొట్టిపారేశాడు. చాలా కాలంగా క్రికెట్‌ ఆడుతున్న తమకు జట్టు ప్రయోజనాల కోసం ఎలా ఆడాలో తెలుసని చెప్పాడు...

Updated : 24 Aug 2021 10:16 IST

లీడ్స్‌: లార్డ్స్‌ టెస్టులో మరీ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశారంటూ తనపై, పుజారాపై వస్తున్న విమర్శలను భారత బ్యాట్స్‌మన్‌ రహానె కొట్టిపారేశాడు. చాలా కాలంగా క్రికెట్‌ ఆడుతున్న తమకు జట్టు ప్రయోజనాల కోసం ఎలా ఆడాలో తెలుసని చెప్పాడు. ముఖ్యమైన వ్యక్తుల గురించే సామాజిక మాధ్యమాల్లో చర్చిస్తారని అన్నాడు. ‘‘జనం నా గురించి మాట్లాడుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. జనం ఎప్పుడూ ముఖ్యమైన వ్యక్తుల గురించే మాట్లాడతారన్నది నా ఉద్దేశం. కాబట్టి వాళ్లేమనుకుంటున్నారన్న దాని గురించి నేను ఆందోళన చెందను. జట్టు కోసం ఏం చేశానన్నదే నాకు ముఖ్యం’’ అని చెప్పాడు. లార్డ్స్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రహానె 146 బంతుల్లో 61, పుజారా 206 బంతుల్లో 45 పరుగులు చేశారు. ‘‘నేను, పుజారా చాలా కాలంగా ఆడుతున్నా. ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో మాకు తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఆడాలో తెలుసు. మా నియంత్రణలో లేని వాటి గురించి మేం ఆలోచించం’’ అని రహానె చెప్పాడు. శార్దూల్‌ ఠాకూర్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడని, సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నాడని తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని