Bhavina Patel: ఆల్‌ ది బెస్ట్ భవీనా.. ఒత్తిడి లేకుండా ఆడు..!

పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయం చేసిన టేబుల్‌ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్‌కు ప్రధాని మోదీ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. రేపు జరగబోయే తుదిపోరులో ఒత్తిడికి గురికావొద్దని సూచించారు. 

Updated : 28 Aug 2021 16:41 IST

భవీనాను ఉత్సాహపరిచిన ప్రధాని 

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయం చేసిన టేబుల్‌ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్‌కు ప్రధాని మోదీ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. రేపు జరగబోయే తుదిపోరులో ఒత్తిడికి గురికావొద్దని సూచించారు. 

‘అభినందనలు భవీనా పటేల్! అద్భుతంగా ఆడావు. రేపటి మీ విజయం కోసం దేశం మొత్తం ప్రార్థిస్తోంది. మీ వంతు ప్రయత్నించండి. ఏ మాత్రం ఒత్తిడికి తలొగ్గకుండా ఆడండి. మీ విజయాలు దేశ ప్రజలందరికీ స్ఫూర్తినిస్తాయి’ అని ట్విటర్ వేదికగా మోదీ ఆమెను ఉత్సాహపరిచారు. 

సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణి జాంగ్‌ మియావోపై భవీనా తిరుగులేని విజయం సాధించింది. 3-2 తేడాతో ఆమెను ఓడించి దేశానికి కనీసం రజతం ఖాయం చేసింది. సెమీస్‌ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘నేనిక్కడికి వచ్చినప్పుడు మరేం ఆలోచించకుండా 100% శ్రమించాలని అనుకున్నా. ఎందుకంటే వందశాతం కష్టపడితే పతకం కచ్చితంగా వస్తుంది. నా దేశ ప్రజల ఆశీర్వాదాలు, ఇదే ఆత్మవిశ్వాసంతో కొనసాగితే ఆదివారం కచ్చితంగా స్వర్ణం గెలవగలను. నేను పసిడి పోరుకు సిద్ధంగా ఉన్నాను’ అని వెల్లడించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని