
సచిన్ నుంచే ఆ లక్షణం నేర్చుకున్నా: పసిడి పతక విజేత ప్రమోద్ భగత్
(Photo: Pramod Bhagat Twitter)
ఇంటర్నెట్‌డెస్క్: ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే లక్షణం క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ నుంచి అలవర్చుకున్నానని టోక్యో పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ పసిడి పతక విజేత ప్రమోద్ భగత్ తెలిపాడు. తాను చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడినని, అప్పటి నుంచే టీవీలో సచిన్ ఆటను చూసేవాడినని అన్నాడు. దాంతో తనకు కూడా అతడిలా ప్రశాంతంగా ఉండే లక్షణం అలవడిందని పేర్కొన్నాడు. మైదానంలో సచిన్ ఒత్తిడి జయిస్తూ ప్రశాంతంగా ఆడేవాడని గుర్తుచేశాడు.
‘నేను చిన్నప్పటి నుంచే సచిన్‌ను ఫాలో అయ్యేవాడిని. అతడి ప్రవర్తన నన్ను అమితంగా ఆకట్టుకుంది. నేను కూడా అలాంటి ఆలోచనా విధానంతోనే ఆడేవాడిని. అలా ప్రశాంతంగా ఉంటూ ఆటపై శ్రద్ధ పెట్టడం నాకెంతో ఉపయోగపడింది. ఎన్నో మ్యాచ్‌ల్లో వెనుకపడిపోయాక తిరిగి పుంజుకోవడంలోనూ బాగా కలిసివచ్చింది. పారాలింపిక్స్ ఫైనల్స్‌లో నేను 4-12 తేడాతో వెనుకంజలో ఉన్నప్పుడు కూడా గెలుస్తాననే నమ్మకంతో ఉన్నా. ప్రశాంతంగా ఆడితే మళ్లీ పుంజుకొని విజయం సాధిస్తానని భావించా’ అని భగత్ చెప్పుకొచ్చాడు.
ఇక పారాలింపిక్స్‌లో పసిడిపతకం సాధించిన అనంతరం సచిన్‌ను కలిశానని, దాంతో తన ఆరాధ్య క్రికెటర్‌ను కలవాలనే కోరిక నెరవేరిందని ప్రమోద్ పేర్కొన్నాడు. జీవితాన్ని, క్రీడలను ఎలా సమన్వయం చేసుకోవాలో సచిన్ తనకు చెప్పారని గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా సచిన్ ఆటోగ్రాఫ్ చేసిన టీ షర్టు బహుమతిగా ఇచ్చాడని తెలిపాడు. ఇక 2005లో తాను బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించినప్పుడు ఈ ఆటకు భవిష్యత్ లేదని భావించానని చెప్పాడు. అనంతరం 2009లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచానని, ఈ క్రమంలోనే ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ పారా బ్యాడ్మింటన్‌ను గుర్తించాక పరిస్థితుల్లో మార్పు వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు తాను పసిడి పతకం సాధిస్తే మంచి గుర్తింపు లభిస్తుందని ఆశించినట్లు తెలిపాడు. అయితే, తాను ఊహించినదానికన్నా మంచి గుర్తింపు లభించిందని ప్రమోద్ సంతోషం వ్యక్తంచేశాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
WhatsApp: మహిళల కోసం వాట్సాప్‌లో కొత్త సదుపాయం
-
Movies News
Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
-
World News
Ukraine Crisis: యుద్ధ భూమిలో వివాహ వేడుకలు.. ఒక్కటవుతున్న వేలాది జంటలు
-
Sports News
Mithali Raj: యువ అథ్లెట్లకు మిథాలీ రాజ్ స్ఫూర్తి: ప్రధాని నరేంద్ర మోదీ
-
General News
PCOD: అధిక బరువుకు బై బై చెప్పేద్దామా.. పరిష్కార మార్గాలివిగో..!
-
Technology News
Microsoft: విండోస్ 8.1 ఓఎస్ యూజర్లకు మైక్రోసాఫ్ట్ షాక్.. అప్‌గ్రేడ్ అవ్వాల్సిందే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం
- R Madhavan: మాధవన్‌పై నెటిజన్ల విమర్శలు.. సైన్స్ తెలియకపోతే సైలెంట్‌గా ఉండు..!
- Jamun Health Benefits: నేరేడు పండు తింటున్నారా?ప్రయోజనాలివే!
- AP Liquor: మద్యంలో విషం
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా