Tokyo Olympics: మీరాబాయి చానుకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు

టోక్యో ఒలింపిక్స్‌లో తొలి పతకం సాధించి భారత్‌కు శుభారంభం అందించిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి

Updated : 24 Jul 2021 19:10 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో తొలి పతకం సాధించి భారత్‌కు శుభారంభం అందించిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా చానుపై ప్రశంసలు కురిపించారు.

* టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి భారత పతకాల పట్టికను తెరిచిన వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలు - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌

* టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను అద్భుతమైన ప్రదర్శనతో యావత్ భారతం ఉప్పొంగిపోతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన ఆమెకు అభినందనలు. ఆమె విజయం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి దాయకం - ప్రధాని మోదీ

* ఒలింపిక్‌ క్రీడల్లో వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో మీరాబాయి చాను రజత పతకం సాధించడం గర్వంగా ఉంది. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలి - కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

* టోక్యోలో భారత్‌ తొలి పతకం నమోదు చేసింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజత పతకం అందుకుంది. యావత్ భారతావని గర్వపడే విషయం. అభినందనలు చాను - కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు

* ఎంత మంచి రోజు! భారత్‌కు ఎంత మంచి విజయం. 49 కిలోల విభాగంలో వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను రజతాన్ని ముద్దాడింది. దీంతో భారత పతకాల పట్టిక మొదలైంది. యావత్‌ దేశాన్ని గర్వపడేలా చేశావు చాను - మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌. బీరేన్‌ సింగ్‌

* తొలి రోజే.. తొలి పతకం. మీరా.. భారత్‌ గర్వపడుతోంది - క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ 

* టోక్యో ఒలింపిక్స్‌ ఆరంభంలోనే దేశానికి తొలి పతకం అందించిన మీరాబాయి చానుకు అభినందనలు. తన పుత్రికను చూసి భారతావని గర్వపడుతోంది - కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ

* ఒలింపిక్స్‌లో భారత్‌కు మెరుపు ఆరంభం. తన అద్భుతమైన ప్రదర్శనతో తొలి పతకాన్ని అందించిన మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలు - తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌

* అభినందనలు మీరాబాయి చాను. నీ విజయం ప్రతి భారతీయుడికి గర్వకారణం - దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన మీరాబాయి చానుకు అభినందనలు. టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి గొప్ప ఆరంభం లభించింది. కరణం మల్లీశ్వరి తర్వాత ఒలింపిక్స్‌ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పతకాన్ని గెలుచుకున్న రెండో భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. - తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని