PV Sindhu: బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్స్‌ కమిషన్‌లో సింధు

భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు.. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెట్ల కమిషన్‌ సభ్యురాలిగా నియమితురాలైంది. సింధుతో పాటు మరో అయిదుగురు సభ్యులు 2025 వరకు ఈ కమిషన్‌లో ఉంటారని

Updated : 21 Dec 2021 08:59 IST

దిల్లీ: భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు.. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెట్ల కమిషన్‌ సభ్యురాలిగా నియమితురాలైంది. సింధుతో పాటు మరో అయిదుగురు సభ్యులు 2025 వరకు ఈ కమిషన్‌లో ఉంటారని బీడబ్ల్యూఎఫ్‌ సోమవారం ప్రకటించింది. ‘‘బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్ల కమిషన్‌ 2021-2025 సభ్యులను ప్రకటించడం ఆనందంగా ఉంది. ఐరిస్‌ వాంగ్‌ (యుఎస్‌ఏ), రాబిన్‌ (నెదర్లాండ్స్‌), గ్రేసియా (ఇండోనేసియా), కిమ్‌ (కొరియా), సింధు (భారత్‌), జెంగ్‌ సీ వీ (చైనా) సభ్యులుగా నియమితులయ్యారు. త్వరలోనే ఈ కమిషన్‌ సమావేశమై ఆ ఆరుగురు సభ్యుల నుంచి ఓ ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు. అలా ఎన్నికైన ఛైర్మన్‌ 2025లో తర్వాతి ఎన్నికలు జరిగే వరకూ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉంటాడు’’ అని బీడబ్ల్యూఎఫ్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని