Rahul Dravid: భారత క్రికెట్‌ జట్టు కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌

భారత క్రికెట్‌ జట్టు కోచ్‌గా మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ నియమితులయ్యారు. టీమిండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ను నియమిస్తూ బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది...

Updated : 03 Nov 2021 22:01 IST

హైదరాబాద్‌: భారత క్రికెట్‌ జట్టు కోచ్‌గా మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ నియమితులయ్యారు. టీమిండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ను నియమిస్తూ బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ తర్వాత ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి పదవీ కాలం ముగియనుంది. టీ20 ప్రపంచకప్‌ తర్వాత న్యూజిలాండ్‌ జట్టుతో జరగనున్న సిరీస్‌కు రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నారు. టీమిండియా ప్రధాన కోచ్‌గా ద్రవిడ్‌ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.

టీమిండియా కోచ్‌గా ఎంపికవడంపై రాహుల్‌ ద్రవిడ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘భారత జట్టు కోచ్‌గా ఎంపికవడం ఎంతో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇలాంటి ఒక అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి సారథ్యంలో భారత జట్టు గొప్ప విజయాలు అందుకుంది. ఇదే విధంగా జట్టును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను. గతంలో ఎన్‌సీఏ, అండర్‌-19, ఇండియా-ఎ స్థాయిలో ప్రస్తుత జట్టు ఆటగాళ్లతో పని చేసిన అనుభవం ఉంది. ప్రతిక్షణం వారి ఆటతీరును మెరుగుపర్చుకొవాలనే అభిరుచి, కోరిక వారిలో ఉంది. రాబోయే రెండేళ్లలో జట్టు సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు అన్ని విధాలా కృషి చేస్తాను’’ అని రాహుల్‌ ద్రవిడ్ ప్రకటనలో అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని