
IND vs NZ: టీమ్‌ఇండియాతో ప్రయాణం మొదలెట్టిన రాహుల్ ద్రవిడ్
ఇన్‌స్టాలో వీడియో పంచుకున్న బీసీసీఐ
ఇంటర్నెట్‌డెస్క్: వచ్చే ఏడాది అక్టోబర్‌లో జరగబోయే 2022 టీ20 ప్రపంచకప్ కోసం టీమ్‌ఇండియా ఇప్పటి నుంచే సన్నద్ధత ప్రారంభించింది. ఈ క్రమంలోనే బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. మరోవైపు గత టీ20 ప్రపంచకప్‌తో రవిశాస్త్రి కోచింగ్ బాధ్యతలు పూర్తవ్వగా.. మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. దీంతో ఇటీవలే యూఏఈ నుంచి భారత్ చేరుకున్న టీమ్ఇండియా ఆటగాళ్లు తాజాగా జైపూర్‌లో ఏకమయ్యారు.
ఈ నేపథ్యంలోనే రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో తొలిసారి ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా బ్యాటింగ్ దిగ్గజం నూతన టీ20 కెప్టెన్ రోహిత్ శర్మకు బాల్స్ వేస్తూ కనిపించాడు. ఆ వీడియోను బీసీసీఐ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొని సంతోషం వ్యక్తం చేసింది. కొత్త బాధ్యతలు, కొత్త సవాళ్లు, కొత్త ప్రారంభం అంటూ వ్యాఖ్యానించింది. ఇక టీ20 ప్రపంచకప్‌లో రెండు అర్ధ శతకాలతో మెరిసిన రోహిత్ శర్మ నెట్స్‌లో బాగా బ్యాటింగ్ చేశాడు. సరైన టైమింగ్‌తో షాట్లు ఆడుతూ అందులో కనిపించాడు. మరోవైపు జైపూర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమనే వార్తలు వినిపిస్తుండటంతో హిట్‌మ్యాన్ రాబోయే సిరీస్‌లో ఎలా చెలరేగుతాడో చూడాలి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.