
Tokyo Paralympics: అవని లేఖరకు రూ.3 కోట్ల నగదు
ఇంటర్నెట్‌డెస్క్: టోక్యో పారాలింపిక్స్‌లో సోమవారం మూడు పతకాలు సాధించిన రాజస్థాన్ అథ్లెట్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. మహిళల ఆర్-2 పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో స్వర్ణం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన అవని లేఖరకు రూ.3 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ట్విటర్లో అభినందిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే జావెలిన్ త్రో ఎఫ్-46 విభాగంలో రజతం, కాంస్యం సాధించిన దేవేంద్ర జజారియా, సుందర్‌సింగ్ గుర్జార్లకు రూ.2 కోట్లు, రూ.1కోటి చొప్పున అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ ముగ్గురు పారాలింపిక్స్‌లో పతకాలు సాధించి దేశం, రాష్ట్రం గర్వపడేలా చేశారని గెహ్లోత్ ప్రశంసించారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ ముగ్గురికి అటవీ శాఖలో కీలక ఉద్యోగాలు ఇవ్వడం గమనార్హం. మరోవైపు పురుషుల డిస్కస్ త్రో ఎఫ్-56 ఈవెంట్లో రజతం సాధించిన ఇంకో అథ్లెట్ యోగేశ్ కతునియాను కూడా రాజస్థాన్ ముఖ్యమంత్రి అభినందించారు. దేశం గర్వపడేలా ప్రదర్శన చేశాడని మెచ్చుకున్నారు. ఇక పారాలింపిక్స్ షూటింగ్లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన అవనికి.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తన కంపెనీ నుంచి ఎస్యూవీ కారును బహుమతిగా ప్రకటించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.