
IPL 2021: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
ఇంటర్నెట్‌డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్‌లో మరో మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. దిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మరికాసేపట్లో అబుదాబి వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. మరోవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న దిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోవాలని చూస్తోంది. ఇక గత మ్యాచ్‌లో అనూహ్య రీతిలో విజయం సాధించిన రాజస్థాన్ అలాంటి ప్రదర్శనే పునరావృతం చేసి పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని చూస్తోంది.
దిల్లీ జట్టు: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, షిమ్రన్ హెట్‌మైర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబాడ, నోర్జె, అవేశ్ ఖాన్
రాజస్థాన్ జట్టు: యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), లివింగ్‌స్టన్, డేవిడ్ మిల్లర్, మహిపాల్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, కార్తిక్ త్యాగి, చేతన్ సకారియా, ముస్తాఫిజర్, తబ్రేజ్ షంసి