Rishabh Pant: గిల్లీ తరహాలోనే పంత్‌.. అందుకే ప్రతిసారీ చర్చల్లోకి వస్తున్నాడు!

యువ వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌కు మాజీ పేసర్‌ ఆశీశ్‌ నెహ్రా అండగా నిలిచాడు. అతడు గిల్‌క్రిస్ట్‌ తరహాలోనే ఆడుతున్నాడని పేర్కొన్నాడు. ఒక వికెట్‌ కీపర్‌గా ఇప్పటికే అతడెన్నో ఘనతలు సాధించాడని గుర్తుచేశాడు....

Published : 01 Sep 2021 15:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌కు మాజీ పేసర్‌ ఆశీశ్‌ నెహ్రా అండగా నిలిచాడు. అతడు గిల్‌క్రిస్ట్‌ తరహాలోనే ఆడుతున్నాడని పేర్కొన్నాడు. ఒక వికెట్‌ కీపర్‌గా ఇప్పటికే అతడెన్నో ఘనతలు సాధించినట్లు గుర్తుచేశాడు. అతడికి కాస్త సమయం ఇవ్వాలని సూచించాడు.

‘రిషభ్‌ పంతే కాదు ఏ అంతర్జాతీయ క్రికెటరైనా సమయాన్ని బట్టి ఆటను మార్చుకోవాలి. ఐతే వారి ఆటతీరును, సొంతశైలి, బలాన్ని మాత్రం మర్చిపోవద్దు. బంతిని డిఫెండ్‌ చేస్తూనో, షాట్‌ ఆడుతూనో వికెట్‌ ఇచ్చేస్తే.. అదే రిషభ్‌ పంత్‌ గబ్బాలో టెస్టు గెలిపించాడని గుర్తుంచుకోవాలి’ అని నెహ్రా అన్నాడు.

‘టెస్టు క్రికెట్లో రిషభ్ పంత్‌ ఆటతీరు, శైలి ఎప్పుడూ చర్చనీయం అవుతున్నాయి. ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌దీ ఇదే తరహా. అతడికి తన బలమేంటో తెలుసు. కెరీర్‌ సాంతం అలాగే ఆడాడు’ అని నెహ్రా పేర్కొన్నాడు. అందుకే పంత్‌కు కాస్త సమయం ఇవ్వాలని సూచిస్తున్నాడు.

‘పంత్‌కు కాస్త సమయం ఇవ్వాలి. అతడు నిర్భయంగా ఆడేందుకు జట్టు యాజమాన్యం అండగా నిలిచింది. కఠిన పరిస్థితుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ పిచ్‌లపై శతకాలు చేసిన ఆటగాడి గురించి మాట్లాడుతున్నామని గుర్తుంచుకోవాలి. ఒక వికెట్‌ కీపర్‌గా మాట్లాడితే ఇప్పటికే అతడెన్నో ఘనతలు సాధించాడు’ అని నెహ్రా వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని