
IND vs ENG: అదరగొట్టిన పంత్, శార్దూల్.. టీమ్ఇండియా భారీ స్కోర్
లండన్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రిషభ్ పంత్ (50; 106 బంతుల్లో 4x4), శార్దూల్ ఠాకూర్ (60; 72 బంతుల్లో 7x4, 1x6) అర్ధశతకాలతో అదరగొట్టారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (44; 96 బంతుల్లో 7x4) ఔటయ్యాక పంత్, ఠాకూర్ శతక భాగస్వామ్యం నిర్మించారు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన స్థితికి చేరడంలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఇద్దరూ అర్ధశతకాలు పూర్తి చేశాక వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు.
భోజన విరామానికి 329/6 స్కోర్‌తో ఉన్న టీమ్ఇండియాను పంత్, శార్దూల్ ఆదుకున్నారు. సరిగ్గా వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లాండ్‌పై పై చేయి సాధించారు. ఈ క్రమంలోనే టీ బ్రేక్‌కు ముందు ఔటయ్యారు. తొలుత రూట్ బౌలింగ్‌లో శార్దూల్ స్లిప్‌లో ఓవర్టన్కు దొరికిపోగా, తర్వాతి ఓవర్లోనే మొయిన్ అలీ బౌలింగ్‌లో అర్ధశతకం సాధించిన పంత్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో భారత్ రెండు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ (13), జస్ప్రిత్ బుమ్రా (19) మరో వికెట్ పడకుండా రెండో సెషన్ పూర్తి చేశారు. అప్పటికి జట్టు స్కోర్ 445/8గా నమోదైంది. భారత్ ఆధిక్యం 346 పరుగులకు చేరింది.