Rohit on Malinga: మలి.. నువ్వో ఛాంపియన్‌: రోహిత్‌

శ్రీలంక పేస్‌ దిగ్గజం లసిత్ మలింగ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు మంగళవారం రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అతడి బౌలింగ్‌ను గుర్తుచేసుకుంటూ పలువురు ఆటగాళ్లు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు...

Updated : 15 Sep 2021 13:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంక పేస్‌ దిగ్గజం లసిత్ మలింగ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు మంగళవారం రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అతడి బౌలింగ్‌ను పలువురు ఆటగాళ్లు సామాజిక మాధ్యమాల వేదికగా గుర్తుచేసుకుంటున్నారు. ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం ట్విటర్‌లో స్పందిస్తూ మలింగను కొనియాడాడు. ఐపీఎల్‌లో ముంబయి ఐదుసార్లు టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన మలింగను ఛాంపియన్‌ అంటూ కీర్తించాడు.

‘మలి.. నువ్వో ఛాంపియన్‌ క్రికెటర్‌లా ఆడావు. నీ అద్భుతమైన కెరీర్‌లో అమోఘమైన ప్రదర్శన చేశావు. ఇకపై నీ జీవితం మరింత బాగుండాలని ఆశిస్తున్నా. హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ రోహిత్‌ ట్వీట్‌ చేశాడు.

కాగా, మలింగ అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 546 వికెట్లు పడగొట్టాడు. 84 టీ20ల్లో 107 వికెట్లు తీయగా 226 వన్డేల్లో 338, 30 టెస్టుల్లో 101 వికెట్లు తీశాడు. మరోవైపు టీ20 క్రికెట్‌లో 100 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గానూ ఈ శ్రీలంక పేసర్‌ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున 12 ఏళ్లు ఆడిన మలింగ.. మొత్తం 122 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు తీశాడు. ఇందులో అతడి అత్యుత్తమ ప్రదర్శన 5/13గా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని