Ross Taylor: 17 ఏళ్లుగా అండగా నిలిచినందుకు థాంక్యూ: రాస్‌టేలర్

న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌టేలర్‌ త్వరలో రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్లు తెలిపాడు. అందుకు సంబంధించిన ట్వీట్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు...

Published : 30 Dec 2021 15:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌టేలర్‌ త్వరలో రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్లు తెలిపాడు. అందుకు సంబంధించిన ట్వీట్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. న్యూజిలాండ్‌ జట్టులోని గొప్ప ఆటగాళ్లలో ఒకడైన టేలర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో 100కు పైగా మ్యాచ్‌లాడిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు.  స్వదేశంలో ఈ వేసవి అనంతరం ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు రాస్‌ ప్రకటించారు.

‘ఈ వేసవి తర్వాత నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నాను. ఆలోపు బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో ఆరు వన్డేలు ఆడాల్సి ఉంది. 17 ఏళ్లుగా నాకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు. న్యూజిలాండ్‌ తరఫున 234 ఆటగాడిగా ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది’ అని టేలర్‌ ట్వీట్‌ చేశాడు. కాగా, 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ కివీస్‌ బ్యాట్స్‌మన్‌ ఏళ్ల తరబడి ఆ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగాడు. దీంతో ఇప్పటివరకు 110 టెస్టుల్లో 19 శతకాలతో 7,584 పరుగులు చేశాడు. అలాగే 233 వన్డేల్లో 21 సెంచరీలతో 8,581 పరుగులు చేశాడు. ఇక టీ20ల్లో 102 మ్యాచ్‌లు ఆడిన టేలర్‌.. 7 అర్ధశతకాలతో 1,909 పరుగులు చేశాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని