Published : 30/08/2021 01:23 IST

Rishabh Pant: పంత్‌ ఇలాగే ఆడితే.. ఇంగ్లాండ్‌లో విజయవంతం కాలేడు: సల్మాన్‌ బట్

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఇలాగే ఆడితే ఇంగ్లాండ్‌లో విజయవంతం కాలేడని పాకిస్థాన్‌ మాజీ సారథి సల్మాన్‌ బట్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో పంత్‌ (2, 1) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సల్మాన్‌ మాట్లాడుతూ పంత్‌ బ్యాటింగ్‌పై తన అభిప్రాయాలు వ్యక్తపరిచాడు. భారత కీపర్‌ కాస్త ప్రశాంతంగా ఆడాలని, వచ్చీరాగానే బౌలర్లపై ఎదురుదాడి చేయొద్దని పలు సలహాలిచ్చాడు. అతడిలాగే ఆడితే తాత్కాలికంగా బతికిపోయినా దీర్ఘకాలంలో ప్రయోజనం ఉండదన్నాడు.

పంత్‌ ఈ ఏడాది టెస్టుల్లో విజయవంతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇంగ్లాండ్‌ పర్యటనలో మూడు టెస్టులు ఆడినా ఒక్కటీ పెద్ద స్కోర్‌ సాధించలేకపోయాడు. అయినా ఈ ఏడాది అతడి టెస్టు బ్యాటింగ్‌ సగటు 43గా నమోదవ్వడం గమనార్హం. సల్మాన్‌ మాట్లాడుతూ.. ‘పంత్‌ ఇలాగే ఆడితే టెస్టుల్లో విజయవంతం కాలేడు. అతడు కాస్తంత ఓపికతో ఆడాలి. దాంతోపాటు రక్షణాత్మక ధోరణి కూడా అలవర్చుకోవాలి. అతడి అమ్ములపొదిలో ఎన్నో వైవిధ్యమైన షాట్లు దాగున్నా డిఫెన్సివ్‌ మెకానిజం మాత్రం అంత మెరుగ్గా లేదు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌ పిచ్‌లపై ఇలాంటి బ్యాటింగ్‌ అస్సలు పనికిరాదు. అతడు భారత్‌, ఆస్ట్రేలియా దేశాల్లో విజయవంతమైనా ఇక్కడ అది సాధ్యంకాదు. ఎందుకంటే ఆయా దేశాల్లో బంతి అంతగా స్వింగ్‌ అవ్వదు. ఈ నేపథ్యంలో పంత్‌ ఇప్పుడు ఆడుతున్న ఆటతీరు బట్టి బంతి ఎక్కడైతే స్వింగ్‌ అవుతుందో, సీమ్‌కు అనుకూలిస్తోందో ఆ సవాళ్లను ఎదుర్కోలేడు’ అని సల్మాన్‌ వివరించాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని