Updated : 26 Dec 2021 09:57 IST

Team India: రవిశాస్త్రినిఅశ్విన్‌ తప్పుగా అర్థం చేసుకున్నాడు: శరణ్‌దీప్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్ మాజీ కోచ్‌ రవిశాస్త్రిని తప్పుగా అర్థం చేసుకున్నాడని మాజీ సెలెక్టర్‌ శరణ్‌దీప్‌ సింగ్‌ అన్నాడు. ఇటీవల అశ్విన్‌ ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో తనకు ఎదురైన అనుభవాల గురించి వివరించాడు. ఈ సందర్భంగా నాటి సిడ్నీ టెస్టులో ఐదు వికెట్లు తీసిన కుల్‌దీప్‌ను శాస్త్రీ ఆరోజు మెచ్చుకుంటూ.. విదేశాల్లో అతడే తమ తొలి ప్రాధాన్య స్పిన్నర్‌ అని వ్యాఖ్యానించాడు. ఈ మాటలతో తాను చాలా బాధపడ్డానని, అప్పుడు తనను బస్సు కింద పడేసినట్లు అనిపించిందని అశ్విన్‌ వాపోయాడు.

అనంతరం అశ్విన్‌ వ్యాఖ్యలపై స్పందించిన శాస్త్రి.. జట్టుకు ఏది అవసరమో అదే చేస్తానని, అందరికీ నచ్చినట్టు వ్యవహరించనని తెలిపాడు. తాను ఎవరికీ వెన్న పూయనని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే శరణ్‌దీప్‌సింగ్‌ ఆ విషయంపై స్పందించాడు. ‘శాస్త్రి వ్యాఖ్యలను టీమ్‌ఇండియా స్పిన్నర్‌ తప్పుగా అర్థం చేసుకున్నాడు. నాటి పర్యటనలో నేనూ జట్టుతోనే ఉన్నాను. విదేశాల్లో కుల్‌దీప్‌ అత్యుత్తమ బౌలర్‌ అని మాత్రమే శాస్త్రి ఉద్దేశం. ఎందుకంటే అక్కడి భిన్న పరిస్థితుల్లో తన బౌలింగ్‌ స్టైల్‌ వైవిధ్యంగా ఉంటుంది. దీన్ని అశ్విన్‌ మరోలా అర్థం చేసుకున్నాడు. ఇందులో శాస్త్రి చెప్పింది నిజమే’ అని శరణ్‌దీప్‌ పేర్కొన్నాడు.

‘అశ్విన్‌ గొప్ప బౌలర్‌. ఇదివరకు ఆఫ్రికన్‌ పిచ్‌లపైనా బాగా రాణించాడు. అతడు గేమ్‌ ఛేంజర్‌ కూడా. అయితే, ఇది అతడికి చివరి పర్యటన కాదు. అతడు ఆడాల్సింది ఇంకా చాలా ఉంది. ఇక ఈ సిరీస్‌లో కోహ్లీ గురించి మాట్లాడాల్సి వస్తే.. చాలా మానసిక ప్రశాంతతతో ఆడతాడు. వన్డే కెప్టెన్సీ వివాదం అతడి ఆటపై ప్రభావం చూపదనుకుంటా. ఇంతకుముందు ఎలా ఆడాడో ఇకపై అలాగే రెచ్చిపోతాడు. ఇప్పుడిక అతడి నుంచి శతకం ఆశించొచ్చు. తనకిప్పుడు సరైన నాణ్యమైన జట్టు ఉంది’ అని శరణ్‌దీప్‌ అభిప్రాయపడ్డాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని