IND vs NZ: టీమ్‌ఇండియా బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన కివీస్‌

భారత బౌలర్ల ధాటికి రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ కుప్పకూలింది.. 

Updated : 04 Dec 2021 16:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారత బౌలర్ల ధాటికి రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 62 పరుగులకే కుప్పకూలింది. అత్యధిక స్కోరర్‌ జేమీసన్‌ (17) కావడం గమనార్హం. భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్‌ చేసిన కివీస్‌.. బ్యాటింగ్‌లో మాత్రం చేతులెత్తేసింది. అశ్విన్‌ (4/8), మహమ్మద్‌ సిరాజ్‌ (3/19) దెబ్బకు కివీస్‌ కుదేలైంది. భారత్‌లో ఏ పర్యాటక జట్టుకైనా అత్యల్ప స్కోరు ఇదే. ఇంతకుముందు వెస్టిండీస్ (75) తక్కువ పరుగులకే ఆలౌటైంది. 

కివీస్‌ ఓపెనర్లు టామ్‌ లేథమ్‌ (10), విల్‌ యంగ్‌ (4), రాస్‌ టేలర్‌ (1)ను సిరాజ్‌ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేర్చాడు. అనంతరం అక్షర్‌ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌ (8) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక రంగంలోకి దిగిన అశ్విన్‌ కీలక వికెట్ల పడగొట్టి టీమ్‌ఇండియా పట్టు సాధించేలా చేశాడు. ఆఖర్లో జేమీసన్‌ కాసేపు ప్రతిఘటించడంతో ఈ మాత్రం స్కోరునైనా చేయగలిగింది. కివీస్‌ బ్యాటర్లలో ఇద్దరు మినహా ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోవడం గమనార్హం. సౌథీ, సోమర్‌విల్లే డకౌట్‌ కాగా.. హెన్రీ నికోల్స్ 7, టామ్‌ బ్లండెల్‌ 8, రచిన్‌ రవీంద్ర 4 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్‌ 4, సిరాజ్ 3, అక్షర్‌ 2, జయంత్‌ యాదవ్‌ ఒక వికెట్ తీశారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 263 పరుగులు ఆధిక్యంలో నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని