Published : 06 Sep 2021 12:21 IST

India T20 WC Team: టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ జట్టు ఇదేనా?

నేటి సాయంత్రం లేదా మంగళవారం ప్రకటన!

ముంబయి: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జట్టును బీసీసీఐ సెలక్టర్ల బృందం ఎంపిక చేసింది. బహుశా సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం జట్టును ప్రకటిస్తారని తెలిసింది. చేతన్‌ శర్మ నేతృత్వంలోనే ఎంపిక కమిటీ నాలుగో టెస్టుకు ముందే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రితో సమావేశమైందని సమాచారం. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొందరి స్థానాల గురించి చర్చించారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

అక్టోబర్‌ 17 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఆరంభమవుతోంది. తొలుత గ్రూప్‌-ఎ, గ్రూప్‌-బిలోని జట్లు తలపడతాయి. ప్రతి గ్రూపులో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సూపర్‌-12కి అర్హత సాధిస్తాయి. అక్టోబర్‌ 23 నుంచి ప్రధాన మ్యాచులు మొదలవుతాయి. ఈ మెగా టోర్నీకి బీసీసీఐ ఆతిథ్యమిస్తున్నా.. కరోనా వల్ల యూఏఈ, ఒమన్‌ను వేదికలుగా ఎంపిక చేశారు. అంతకన్నా ముందు యూఏఈలో ఐపీఎల్‌ జరిగే సంగతి తెలిసిందే.

ఇప్పటికే జట్టు ఎంపిక పూర్తైందని తెలిసింది. నాలుగో టెస్టు ఫలితం త్వరగా తేలితే సోమవారం సాయంత్రమే జట్టును ప్రకటిస్తారు. ఆలస్యమైతే మంగళవారం ఉదయం ప్రకటిస్తారని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ఎవరెవరిని ఎంపిక చేయాలి? ఏ స్థానాల్లో ఎవరిని ఆడించాలన్న అంశాలపై నాలుగో టెస్టుకు ముందే కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ వర్చువల్‌గా సమావేశమైంది.

ఐసీసీ 15 మందికే రీయింబర్స్‌ చేస్తున్నా బీసీసీఐ మాత్రం అదనంగా మరో ఐదుగురిని ఎంపిక చేయనుంది. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ముందు జాగ్రత్త పడుతోంది. ఐపీఎల్‌ బుడగ నుంచి ప్రపంచకప్‌ బుడగకు వీరంతా బదిలీ అవుతారు. ఇంగ్లాండ్‌, శ్రీలంక పర్యటనలకూ బీసీసీఐ జంబో జట్లనే ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్ పంత్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, యుజ్వేంద్ర చాహల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, శిఖర్‌ ధావన్‌ ప్రపంచకప్‌ ప్రధాన జట్టులో ఉండే అవకాశం ఉంది. ఎవరైనా గాయపడితే రిజర్వుగా వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, పృథ్వీ షా, దీపక్‌ చాహర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణను ఎంపిక చేస్తారని సమాచారం.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని