Cricket News: హార్దిక్‌ పాండ్యను ముందే హెచ్చరించా: షోయబ్‌ అక్తర్

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను వెన్నెముక సమస్య గురించి ముందే హెచ్చరించానని అంటున్నాడు పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత పాండ్య...

Updated : 12 Dec 2021 11:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెన్నెముక సమస్య గురించి టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను ముందే హెచ్చరించానని అంటున్నాడు పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత పాండ్య వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ గాయం నుంచి కోలుకున్నాక కూడా అతడు పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో కెరీర్‌ గ్రాఫ్‌ అమాంతం పడిపోతోంది. దీంతో ఇటీవల బౌలింగ్‌ చేయకుండా కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమవుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో, టీ20 ప్రపంచకప్‌లో విఫలమయ్యాడు. ఇక తాజాగా ముగిసిన న్యూజిలాండ్‌ సిరీస్‌తో పాటు త్వరలో జరగబోయే దక్షిణాఫ్రికా పర్యటనకూ అతడిని ఎంపిక చేయలేదు.

ఈ క్రమంలోనే అక్తర్.. ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ హార్దిక్‌ పాండ్య ఫిట్‌నెస్‌పై స్పందించాడు. ‘ఒకసారి నేను దుబాయ్‌లో బుమ్రా, హార్దిక్‌ పాండ్యతో మాట్లాడాను. వాళ్లను చూస్తుంటే బక్కపలచగా ఉన్నారు. వాళ్ల వెన్నెముకలు కూడా బలంగా లేవని అనిపించింది. అప్పుడు పాండ్య తీరికలేని విధంగా క్రికెట్‌ ఆడుతున్నట్లు చెప్పాడు. నువ్వు త్వరలోనే గాయపడతావని అతడిని హెచ్చరించా. నేను అలా చెప్పిన గంటన్నరకే అతడు గాయపడ్డాడు’ అని అక్తర్‌ చెప్పుకొచ్చాడు. కాగా, టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ 2018 ఆసియా కప్‌ సందర్భంగా పాకిస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఆ తర్వాత అతడికి వెన్నెముక సమస్య వెంటాడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని