Sourav Ganguly: గంగూలీకి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ పాజిటివ్

టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీకి తాజాగా నిర్వహించిన పరీక్షల్లో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకినట్లుగా...

Updated : 02 Jan 2022 13:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీకి తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకినట్లుగా గుర్తించామని వుడ్‌లాండ్స్‌ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గత వారం కరోనా బారిన పడిన గంగూలీ కోల్‌కతాలోని వుడ్‌లాండ్స్‌ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు ఒమిక్రాన్‌ పరీక్షలు నిర్వహించగా.. అందులో నెగెటివ్‌ రావడంతో డిశ్ఛార్జి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు డెల్టా ప్లస్‌ పాజిటివ్‌గా గుర్తించామని చెప్పారు. ప్రస్తుతం ఆయనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉండటంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలని సూచించామన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని