India vs Srilanka: శ్రీలంకకు షాక్‌.. మ్యాచ్‌ ఫీజులో కోత

వరుస ఓటములతో సతమతం అవుతున్న శ్రీలంకకు మరో షాక్‌! నిర్దేశిత సమయంలో ఓవర్లు విసరనందుకు ఆ జట్టుకు జరిమానా విధించారు. ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ రంజన్‌ మడుగలె.. లంకేయుల మ్యాచు ఫీజులో 20% కోత విధించారు....

Published : 23 Jul 2021 01:23 IST

కొలంబో: వరుస ఓటములతో సతమతమవుతున్న శ్రీలంకకు మరో షాక్‌! నిర్దేశిత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు ఆ జట్టుకు జరిమానా విధించారు. ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ రంజన్‌ మడుగలె.. లంకేయుల మ్యాచు ఫీజులో 20% కోత విధించారు. అంతేకాకుండా సూపర్‌ లీగ్‌ పాయింట్లలో ఒక పాయింట్‌ కోత పెట్టారు. కెప్టెన్‌ శనక పొరపాటును అంగీకరించడంతో ఎలాంటి విచారణ జరగలేదు.

ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్‌ చేసిన లంక.. అసలంక (65), అవిష్క ఫెర్నాండో (50), కరుణ రత్నె (44*) రాణించడంతో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ఛేదనలో టీమ్‌ఇండియా 160కే 6 వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో భువనేశ్వర్‌తో కలిసి దీపక్‌ చాహర్‌ (69*) జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఆఖర్లో మ్యాచ్‌ ఉత్కంఠకు దారితీయడంతో శనక నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేశాడు. ఫలితంగా అనుకున్న సమయంలోగా లంక ఓవర్లు పూర్తి చేయలేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని