SRH to Warner : డేవిడ్‌ వార్నర్‌కు ఎస్ఆర్‌హెచ్‌ ట్వీట్.. ఏముందంటే?

ఆసీస్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం...

Published : 29 Dec 2021 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఆసీస్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం సర్‌ప్రైజ్ ఇచ్చింది. యాషెస్‌ సిరీస్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంతో వార్నర్‌కు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాకుండా ఐపీఎల్‌ మెగా వేలంలో అంతా మంచి జరగాలని ఆకాంక్షించింది. ఈ మేరకు ట్వీట్‌ చేయడం విశేషం. ఐపీఎల్ 14వ సీజన్‌లో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించింది. యూఏఈ ఎడిషన్‌లో జట్టులో స్థానం కూడా కల్పించలేదు. దీంతో ఎస్ఆర్‌హెచ్, వార్నర్ మధ్య బంధం బీటలువారిందని చర్చకు తెరదీసింది. డేవిడ్‌ వార్నర్‌ను రిటెయిన్‌ చేసుకోకపోవడం.. తాను మెగా వేలంలోకి వెళ్తానని డేవిడ్ ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. 

ఈ క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీ ప్రధాన కోచ్‌గా టామ్‌ మూడీ మళ్లీ నియమితులయ్యాడు. ఐపీఎల్ 2022 సీజన్‌ కోసం మంచి జట్టును ఎంచుకోవాలని ట్విటర్‌ వేదికగా మూడీకి ఓ అభిమాని సలహా ఇచ్చాడు. తప్పకుండా ప్రయత్నిస్తామని మూడీ సమాధానం ఇచ్చాడు. అయితే దీనిని ట్యాగ్‌ చేస్తూ డేవిడ్ వార్నర్‌ ‘అది పెద్ద అనుమానమే’ అని అర్థం వచ్చేలా స్పందించాడు. దీనికి ఎస్‌ఆర్‌హెచ్‌ రిప్లై ఇస్తూ.. ‘‘ యాషెస్‌ గెలిచినందుకు కంగ్రాట్స్‌ డేవిడ్. చూస్తుంటే తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్లు ఉన్నావుగా. విజయం అనంతరం పార్టీని ఎంజాయ్‌ చేయ్‌. ఇదేకాకుండా మెగా వేలంలో నీకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం’’ అంటూ ట్వీట్‌ చేసింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని