INDvsENG: ఇంగ్లాండ్‌ పుంజుకోవాలంటే అద్భుతం జరగాలి: సన్నీ

ప్రస్తుతం టీమ్‌ఇండియాతో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు కోలుకోవాలంటే అద్భుతం జరగాలని మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన...

Published : 23 Aug 2021 01:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం టీమ్‌ఇండియాతో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు కోలుకోవాలంటే అద్భుతం జరగాలని మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కథనంలో సన్నీ ఈ వ్యాఖ్యలు చేశాడు. అలాగే రెండో టెస్టులో టీమ్‌ఇండియా మానసికంగా ఎంతో దృఢత్వం సంపాదించిందని చెప్పాడు. దాంతో ఆతిథ్య జట్టు పుంజుకోవడం కష్టమని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌లో ఏదైనా జరగొచ్చని, ఒక్కసారిగా పరిస్థితులన్నీ తారుమారు అవ్వొచ్చని తెలిపాడు. అందుకు అద్భుతం జరగాలన్నాడు.

లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టు చివరి రోజు ఉదయం పూట ఇంగ్లాండ్‌ గెలుస్తుందని అంతా అనుకున్నారని, కానీ ఐదోరోజు ఆటలో కనీసం 180 పరుగులైనా చేయడం కష్టతరమైందని గావస్కర్‌ వివరించాడు. ఈ క్రమంలోనే ఆతిథ్య జట్టు 150 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైందన్నాడు. అలాగే ఇంగ్లాండ్‌ జట్టులో కెప్టెన్‌ జో రూట్‌ మినహా ఎవరూ బ్యాటింగ్‌ చేయలేరని గుర్తుచేశాడు. అతడి మీదే ఆ జట్టు అధికంగా ఆధారపడుతుందని వెల్లడించాడు. దాంతో రూట్‌ను ఔట్‌ చేస్తే ఇంగ్లాండ్‌ పని ఖతమైనట్టేనని మాజీ బ్యాట్స్‌మన్‌ పేర్కొన్నాడు. చివరగా బెన్‌స్టోక్స్‌పై స్పందిస్తూ.. తానే ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ అయి ఉంటే ఆటకు దూరంగా ఉన్న అతడిని తిరిగి జట్టులో కొనసాగమని కోరేవాడినని అన్నాడు. స్టోక్స్‌ అరుదైన క్రికెటర్‌ అని, అలాంటి వ్యక్తి ఆటకు దూరంగా ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని