Suresh Raina: రైనా వింటర్‌ స్పెషల్‌ డిష్‌.. నోరూరించే ‘సార్సోం కా సాగ్‌’ మీకోసం!

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా అద్భుతమైన ఆటగాడే కాకుండా మంచి చెఫ్‌ అని కూడా నిరూపించుకున్నాడు. ఇప్పుడు క్రికెట్‌ లేకపోవడంతో ఖాళీ సమయాన్ని కుటుంబ...

Published : 17 Dec 2021 01:51 IST

(Photo: Suresh Raina Instagram video Screen shot)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా అద్భుతమైన ఆటగాడే కాకుండా మంచి చెఫ్‌ అని కూడా నిరూపించుకున్నాడు. ఇప్పుడు క్రికెట్‌ లేకపోవడంతో ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నాడు. అలాగే ఎప్పటికప్పుడు తానేం చేస్తున్నాననే విషయాలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ శీతాకాల ప్రత్యేక వంటకాన్ని తయారు చేసి తన కుటుంబసభ్యులకు రుచిచూపించాడు. అందుకు సంబంధించిన వీడియోను రైనా షేర్‌ చేశాడు.

ఆ ప్రత్యేక వంటకం పేరు ‘సార్సోం కా సాగ్‌’ అని తెలిసింది. దీన్ని శీతకాలంలో పంజాబ్‌లో ఎక్కువగా వండుతారట. ఈ వీడియోలో రైనా స్టవ్‌ మీద ఒక పాన్‌ పెట్టి ఘుమఘుమలాడే విధంగా ‘సార్సోంకాసాగ్‌’ను తయారుచేయడం చూడొచ్చు. దానికి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌గా గుర్‌దాస్‌ మాన్‌ పాట ‘అప్నా పంజాబ్‌ హోవే’ పాటను సెట్‌ చేశాడు. కాగా, ఈ వంటకాన్ని ఆవపిండి, పాలకూర, మెంతికూరలతో కలిపి వండుతారని తెలిసింది. దీన్ని రోటీలకు అంటించుకొని తింటారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు నోరూరిపోతుందని కామెంట్లు పెడుతున్నారు. మహిమా చౌదరీ, భార్తీ సింగ్‌ అనే నటీమణులు సైతం మాకూ కొంచెం పంపండని కామెంట్లు పెట్టారు. రైనా ఎలా వండాడో మీరూ ఓ లుక్కేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని