Surya kumar Yadav - Prithvi shaw : అమ్మో.. సూర్య, షా! మామూలు నటన కాదయ్యా మీది!

టీమ్‌ఇండియా క్రికెటర్లలో కళాకారులు చాలామందే ఉన్నారు! గతంలో టిక్‌టాక్‌లో అలరించేవారు. ఇప్పుడు ఇన్‌స్టాలో లఘు వీడియోలు చేస్తున్నారు...

Published : 19 Aug 2021 01:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా క్రికెటర్లలో కళాకారులు చాలామంది ఉన్నారు! గతంలో టిక్‌టాక్‌లో అలరించేవారు. ఇప్పుడు ఇన్‌స్టాలో లఘు వీడియోలు చేస్తున్నారు. చాలామంది యువ ఆటగాళ్లు సోషల్‌ మీడియాలో అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా సూర్యకుమార్‌ యాదవ్‌, పృథ్వీ షా చేసిన ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. అందులో సూర్య, షా నటన చూస్తే నవ్వాగడం లేదు.

ఇంగ్లాండ్‌ సిరీసు కోసం సూర్య, షా ఇక్కడికి వచ్చిన సంగతి తెలిసిందే. గాయపడ్డ శుభ్‌మన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ స్థానాల్లో వారు జట్టులో చేరారు. శ్రీలంక నుంచి నేరుగా ఈ బుడగలో ప్రవేశించారు. ఎప్పుడు చేశారో తెలియదు కానీ వారు చేసిన ఈ వీడియో అద్భుతంగా ఉంది! ఓ కాఫీ కప్‌ పట్టుకొని సూర్య రుచి చూస్తున్నాడు. వెనకే కూర్చున్న పృథ్వీ షాను చూసి ‘హిహ్హిహ్హి..’ అంటూ నవ్వుతున్నాడు. వీడియో సాంతం వీరిద్దరు చేసిన నటన ఆకట్టుకుంది. తెగ నవ్విస్తోంది. ఆ వీడియో మీకోసం...!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని