
T20 World Cup: వార్నర్ ఆ షాట్ ఆడటానికి అన్ని హక్కులున్నాయి: జంపా
గంభీర్ వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా స్పిన్నర్
ఇంటర్నెట్‌డెస్క్: ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. మహ్మద్ హఫీజ్ బౌలింగ్‌లో చేతులు జారిన ఓ బంతిని సిక్సర్‌గా మలిచిన సంగతి తెలిసిందే. ఇది క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరుసటి రోజే టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఓ ట్వీట్ చేస్తూ అలాంటి షాట్ ఆడినందుకు సిగ్గుగా లేదా అంటూ వార్నర్‌పై మండిపడ్డాడు. గంభీర్ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన ఆడం జంపా.. గౌతీ సరైన పాయింటే లేవనెత్తాడని, అయితే.. వార్నర్ ఆ షాట్ ఆడటంలో ఎలాంటి తప్పులేదని అభిప్రాయపడ్డాడు. ఆ బంతిని సిక్సర్‌గా మలచడానికి అతడికి పూర్తి హక్కులున్నాయన్నాడు. కాగా, హఫీజ్ బౌలింగ్‌లో చేయిజారిన బంతి రెండుసార్లు పిచ్‌ను తాకుతూ పక్కకు వెళ్లడంతో వార్నర్ వికెట్లకు దూరంగా వెళ్లి మరీ ఆ బంతిని సిక్సర్‌గా మలిచాడు. దానికి ఆరు పరుగులిచ్చి అంపైర్ నోబాల్ ప్రకటించాడు.
ఈ నేపథ్యంలోనే గంభీర్ స్పందిస్తూ ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, ఇలాంటి షాట్ ఆడటానికి వార్నర్‌కు సిగ్గు లేదా? అని పేర్కొంటూ దీనిపై మాట్లాడాలని అశ్విన్‌ను ట్యాగ్ చేశాడు. వార్నర్ ఆడిన షాట్ సరైంది అయితే, ఐపీఎల్‌లో తాను చేసిన మన్కడింగ్ కూడా సరైందేనని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ తాను చేసింది తప్పయితే.. ఇప్పుడిది కూడా తప్పేనని వివరించాడు. ఈ క్రమంలోనే ఓ ఆసీస్ అభిమాని గంభీర్, అశ్విన్‌లను ట్యాగ్ చేస్తూ.. వార్నర్ తనముందు పడిన బంతిని షాట్ ఆడాడని, అందులో తప్పేం లేదని అన్నాడు. దీనికి ప్రతిస్పందించిన అశ్విన్.. ‘అవును.. నిజంగానే అది అద్భుతమైన షాట్. వార్నర్ బాగా ఆడాడు’ అంటూ తనదైన శైలిలో బదులిచ్చాడు. ఈ నేపథ్యంలోనే జంపా మాట్లాడుతూ.. తన బౌలింగ్‌లో ఇలా ఎప్పుడూ జరగలేదని, ఇకపైనా జరగకూడదని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అనంతరం క్రీడాస్ఫూర్తి వివాదంపై మాట్లాడిన జంపా.. మన్కడింగ్‌కు తాను వ్యతిరేకం కాదన్నాడు. ఇదివరకు అలా ఎప్పుడూ చేయకపోయినా భవిష్యత్‌లో చేయనని కూడా చెప్పలేనన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.