T20 World Cup: సెహ్వాగ్‌ - గంభీర్‌ తర్వాత రోహిత్‌ - రాహులే..!

టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్‌ రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌ అరుదైన రికార్డు నెలకొల్పారు. బుధవారం రాత్రి అఫ్గానిస్థాన్‌తో తలపడిన వేళ వీరిద్దరూ...

Published : 04 Nov 2021 20:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్‌ రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌ అరుదైన రికార్డు సృష్టించారు. బుధవారం రాత్రి అఫ్గానిస్థాన్‌తో తలపడిన వేళ వీరిద్దరూ తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి బలమైన పునాది వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌ తరఫున అత్యుత్తమ ఓపెనింగ్‌ 140 భాగస్వామ్యం రికార్డు కూడా సాధించారు. ఈ ఘనత సాధించిన రెండో భారత ఓపెనింగ్‌ జంటగా నిలిచారు. అంతకుముందు 2007 టీ20 ప్రపంచకప్‌లో మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌ ఇంగ్లాండ్‌పై 136 పరుగుల శతక భాగస్వామ్యం నెలకొల్పారు. మళ్లీ ఇన్నాళ్లకు పొట్టి ప్రపంచకప్‌లో రోహిత్‌, రాహుల్‌ భారత్‌ తరఫున శతక భాగస్వామ్యం సాధించిన ఓపెనర్లుగా నిలిచారు.

టీ20ల్లో అత్యధిక శతక భాగస్వామ్యాలు..
* 5 సార్లు : బాబర్‌ అజామ్‌ - మహ్మద్‌ రిజ్వాన్‌ 
* 4 సార్లు: శిఖర్‌ ధావన్‌ - రోహిత్ శర్మ
* 4 సార్లు: మార్టిన్‌ గప్తిల్‌ - కేన్‌ విలియమ్సన్‌
* 4 సార్లు: కేఎల్‌ రాహుల్‌ - రోహిత్‌ శర్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని