
T20 World Cup Winner: కివీస్‌పై ఆస్ట్రేలియా ఎలా గెలిచిందో చూడండి!
ఇంటర్నెట్‌డెస్క్: 2021 టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది. ఆదివారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో తొలిసారి పొట్టి కప్పును ముద్దాడింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (85; 48 బంతుల్లో 10x4, 3x6) కళాత్మక ఇన్నింగ్స్ ఆడటంతో కివీస్ మంచి స్కోరే సాధించింది. కానీ, ఛేదనలో రెచ్చిపోయిన ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ‘ఉఫ్’మని ఊదేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (5) విఫలమైనా డేవిడ్ వార్నర్ (53; 38 బంతుల్లో 4x4, 3x6), మిచెల్ మార్ష్ (77; 50 బంతుల్లో 6x4, 4x6) దంచికొట్టడంతో సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన హైలైట్స్ వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ తుదిపోరు ఎలా సాగిందో మీరూ చూసేయండి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.