Updated : 05/11/2021 09:25 IST

T20 World Cup: ఆటకు వీడ్కోలు పలికిన విండీస్‌ స్టార్‌ డ్వేన్‌ బ్రావో

ఇంటర్నెట్‌డెస్క్‌: వెస్టిండీస్ స్టార్‌​ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్​ టోర్నీ అనంతరం రిటైర్‌​ కానున్నట్లు ప్రకటించాడు. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో విండీస్ ఓటమి అనంతరం అతడు ఫేస్​బుక్​ లైవ్​లో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశాడు. ‘‘వీడ్కోలుకు సమయం వచ్చేసింది. 18 ఏళ్లుగా విండీస్​ జట్టులో ఆడుతున్నాను. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. కరీబియన్​ జట్టులో ఆడటం ఎల్లప్పుడూ అదృష్టంగానే భావిస్తాను. మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించడం గొప్పగా ఉంది. అందులో డారెన్‌ సామీ కెప్టెన్సీలో రెండు టీ20 ప్రపంచకప్‌లు గెలుపొందడం సంతోషంగా ఉంది’’ అని అన్నాడు.

కాగా, ఈ ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌గా అడుగుపెట్టిన వెస్టిండీస్‌ పేలవ ఆటతీరుతో నిరాశపర్చింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒకటే విజయం సాధించి టోర్నీ నుంచి నిష్క్రమించింది. శనివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌ బ్రావోకి చివరి మ్యాచ్‌ కానుంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని