T20 World Cup: టీమ్‌ఇండియా స్కోర్‌ కన్నా పెట్రోల్‌ ధరే ఎక్కువ

ఈ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా దారుణ ఓటములకు సగటు అభిమాని నిజంగానే తీవ్ర నిరాశకు గురయ్యాడు...

Published : 02 Nov 2021 01:50 IST

కోహ్లీసేనపై మండిపడుతున్న నెటిజన్లు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా దారుణ ఓటములకు సగటు అభిమాని నిజంగానే తీవ్ర నిరాశకు గురయ్యాడు. ప్రపంచకప్‌ టోర్నీల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై తిరుగులేని రికార్డున్న టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలైనా.. ఆటలో ఎవరికైనా గెలుపోటములు సహజమే అని చాలా మంది తేలిగ్గా తీసుకున్నారు. కానీ, న్యూజిలాండ్‌తో ఆట చూశాక ఇది అసలు కోహ్లీసేనేనా..? టైటిల్‌ ఫేవరెట్‌ జట్టేనా..? అనే అనుమానం కలిగింది. క్రీజులో నిలబడి ఆడాలనే పట్టుదల ఏ ఆటగాడిలోనూ కనిపించలేదు. వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వచ్చినట్లు షాట్లు ఆడటం పెవిలియన్‌ చేరడం.. ఏదో వచ్చామా.. ఆడామా.. వెళ్లామా అన్నట్లు కనిపించింది. ఈ క్రమంలోనే చివరికి అతి కష్టం మీద 110/7 పరుగులు చేసి ఏదో నెట్టుకొచ్చారు. ఆ తర్వాత బౌలింగ్‌లో రాణించి విజయంపై ఆశలు పెంచుతారేమో అని ఎదురుచూసిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. కివీస్‌ ఛేదనలో 14.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో టీమ్‌ఇండియా సెమీస్‌ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి.

ఈ నేపథ్యంలోనే తీవ్ర అసహనానికి గురైన అభిమానులు, నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కోహ్లీ సేనపై విమర్శలు గుప్పిస్తున్నారు. దారుణమైన ట్రోలింగ్‌ చేస్తున్నారు. కోచ్‌ రవిశాస్త్రి, మెంటార్‌ ధోనీ, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. ప్రతి ఒక్కర్నీ టార్గెట్‌ చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీసేన కొట్టిన స్కోర్‌.. భారత్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర కంటే తక్కువే అని వ్యంగ్యంగా మీమ్స్‌ పెడుతున్నారు. మరోవైపు ఐపీఎల్‌లో రాణిస్తూ.. ఇక్కడ విఫలమవడంపైనా కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్‌ను బ్యాన్‌ చేయాలంటూ పోస్టులు చేస్తున్నారు.










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని