
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్ హైలైట్స్
ఇంటర్నెట్‌డెస్క్: పాకిస్థాన్‌తో జరిగిన తొలి పోరులో టీమ్‌ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (0), కేఎల్ రాహుల్ (3) విఫలమయ్యారు. పాక్ పేసర్ షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో వీరిద్దరూ ఆదిలోనే పెవిలియన్ చేరారు. దీంతో భారత్ ఆరు పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడింది. అనంతరం సూర్యకుమార్ (11; 8 బంతుల్లో 1x4, 1x6) ఔటైనా కెప్టెన్ విరాట్ కోహ్లీ (57; 49 బంతుల్లో 5x4, 1x6), రిషభ్ పంత్ (39; 30 బంతుల్లో 2x4, 2x6) రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. అయితే, వీరిద్దరూ కీలక సమయాల్లో ఔటయ్యారు. చివరికి టీమ్‌ఇండియా 151/7 స్కోర్‌తో సరిపెట్టుకుంది. ఈ క్రమంలోనే భారత్ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఓపెనర్లు 17.5 ఓవర్లలో పూర్తి చేశారు. మహ్మద్ రిజ్వాన్ (79; 55 బంతుల్లో 6x4, 3x6), బాబర్ అజామ్ (68; 52 బంతుల్లో 6x4, 2x6) నాటౌట్‌గా నిలిచి పాకిస్థాన్‌కు ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాపై తొలి ఘన విజయాన్ని అందించారు. దీంతో ఈ టీ20 ప్రపంచకప్‌లో దాయాది జట్టు తొలి మ్యాచ్‌లోనే బోణీకొట్టింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన హైలైట్స్ వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ మ్యాచ్ ఎలా సాగిందో మీరూ చూసేయండి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.