Published : 06 Nov 2021 10:38 IST

T20 World Cup: రోహిత్‌, రాహుల్‌ ఇలా కొట్టడం ఇంతకుముందు చూడలేదు!

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ప్రపంచకప్‌లో వరుసగా రెండో మ్యాచ్‌ గెలిచి సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పాక్‌, న్యూజిలాండ్‌ జట్లతో ఓటమిపాలైన కోహ్లీసేన తర్వాత అఫ్గాన్‌, స్కాట్లాండ్‌లపై విజయం సాధించింది. దీంతో సంక్లిష్టమైన సెమీస్‌ ఆవకాశాలను మెరుగుపర్చుకుంది. ఆదివారం అఫ్గానిస్థాన్‌ మాయ చేసి న్యూజిలాండ్‌ను ఓడిస్తే భారత్‌ పొట్టి ప్రపంచకప్‌లో మళ్లీ తన ప్రయాణాన్ని ముందుకు సాగించే వీలుంది. ఈ క్రమంలోనే గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలిసారి టాస్‌ గెలిచిన కెప్టెన్‌ కోహ్లీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఆపై షమి, జడేజా, బుమ్రా రాణించి స్కాట్లాండ్‌ను 85 పరుగులకే కట్టడి చేశారు. షమి వేసిన 17వ ఓవర్‌లో భారత్‌ హ్యాట్రిక్‌ వికెట్లు సాధించింది. ఇక ఛేదనలో కేఎల్‌ రాహుల్‌ (50), రోహిత్‌ శర్మ (30) దంచికొట్టడంతో టీమ్‌ఇండియా 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేసింది. వీటికి సంబంధించిన వీడియోలను ఐసీసీ అభిమానులతో పంచుకుంది. మీరూ వాటిని చూసి ఆస్వాదించండి.



Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని